ఆదివారం 31 మే 2020
Business - Apr 19, 2020 , 23:56:53

జీతాల్లేని సెలవులు

జీతాల్లేని సెలవులు

  • ఉద్యోగులకు ఇస్తున్న విమానయాన సంస్థలు

ముంబై: లాక్‌డౌన్‌ ప్రభావంతో విమానాలు నేలపట్టునే నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలు..ఉద్యోగులకు జీతాల్లేని సెలవులను ఇస్తున్నాయి. వచ్చే నెల 3 వరకు వేతనాలు లేని సెలవులు మంజూరు చేస్తున్నట్లు గో-ఎయిర్‌ తాజాగా ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ఈ నెల 14 నుంచి వచ్చే నెల 3 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరో సంస్థ స్పైస్‌జెట్‌ కూడా ఎంపిక చేసిన సిబ్బందిని సెలవులపై పంపింది. రూ.50 వేల కంటే అధిక వేతనాన్ని పొందుతున్న సిబ్బందికి వచ్చే నెల 3 వరకు సెలవులు మంజూరు చేసింది. మరోవైపు వచ్చే నెల 4 నుంచి విమాన టిక్కెట్ల బుకింగ్‌నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసు రాలేదని విస్తారా, ఎయిర్‌ఏషియా ఇండియాలు స్పష్టం చేశాయి. ఇందుకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసు కోసం ఎదురుచూస్తున్నట్లు విస్తారా ప్రతినిధి ఒకరు తెలిపారు. 


logo