e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home బిజినెస్ యులిప్‌ అదరహో

యులిప్‌ అదరహో

  • అటు బీమా.. ఇటు మదుపు
యులిప్‌ అదరహో

యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (యులిప్‌)లు దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనాదరణను పొందాయి. అయితే అవి పాలసీదారులకు లేదా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడిని అందించడంలో విఫలం కావడంతో అంతే వేగంగా నిరాదరణకు గురయ్యాయి. బీమా, మదుపు రెండింటిని కలిపి రూపొందించిన యులిప్‌లు.. తొలుత మార్కెట్‌ హోరులో అందులోని రిస్క్‌లను, వ్యయాలను అర్థం చేయించడంలో విఫలం అయ్యాయి. బీమా అంటేనే దీర్ఘకాలం. దాన్ని స్పల్వ కాలంలోనూ రాబడులు ఇవ్వగల ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపెట్టి యులిప్‌లను రూపొందించడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దానికితోడు మార్కెట్‌ రిస్క్‌ల ఆధారంగా రాబడులు ఉండడంతో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యులిప్‌లను ప్రారంభించిన తొలినాళ్లలో మూడేండ్ల తర్వాత లిక్విడిటీ ఉండేది. దాన్ని ఐదేండ్లకు పెంచారు. ఈ రెండు సందర్భాలలోనూ ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి. ముఖ్యంగా బీమా, మదుపు.. ఈ రెండూ దీర్ఘకాలంలోనూ రాబడులను ఇస్తాయన్న విషయాన్ని ప్రచారం చేయడంలో బీమా కంపెనీలు విఫలం చెందాయి. దీనికితోడు వీటిపై చార్జీలు కూడా అధికమే. దీంతో ఐఆర్‌డీఏఐ అలాట్‌మెంట్‌, మోర్టాలిటి చార్జీలను భారీగా తగ్గించింది. దీంతో ఇప్పుడు పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. దీర్ఘకాలానికి బీమాతోపాటే మదుపు చేయాలనుకునేవారు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2003-10తో పోల్చితే ఇప్పుడు చాలా తేడానే కనిపిస్తున్నది. ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో తమ పెట్టుబడిపై మిగతా సాధనాల కన్నా అధిక రాబడి ఉండాలని కోరుకుంటారు. అలాగే రిస్క్‌ గురించి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ రెండింటి సమ్మేళనమే యులిప్‌. జీవిత బీమాతోపాటే దీర్ఘకాల రాబడులను అందించేందుకు ఇప్పుడు బీమా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే యులిప్‌లను కొనుగోలు చేసేటప్పుడే దీర్ఘకాలం కోసం మాత్రమే వీటిని కొనుగోలు చేయాలి. చెల్లించే ప్రీమియంలో కొంత భాగం బీమా కోసం, మరి కొంత ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం వినియోగిస్తారు. యులిప్‌లతో సానుకూల ప్రయోజనాలేమిటో చూద్దాం.

ప్రయోజనాలు

యులిప్‌ అదరహో
- Advertisement -

జీవిత బీమా, పెట్టుబడిపై రాబడి. ఈ రెండు లక్ష్యాలను ఒకే పాలసీ ద్వారా పొందవచ్చు. యులిప్‌ ద్వారా వార్షిక ఆదాయంతో 10 నుంచి 20 రెట్ల వరకు బీమాను పొందే వీలుంది. అలాగే పాలసీ పనితీరు నచ్చకపోతే ఐదేండ్ల తర్వాత ప్రీమియం చెల్లింపులను నిలిపివేసుకునే వెసులుబాటు ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో మాదిరిగా వీటిపై ఎక్స్‌పెన్స్‌ రేషియో చాలావరకు తగ్గించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చి కొనుగోలు చేయవచ్చు. మిగిలిన జీవిత బీమా ప్రీమియంల మాదిరిగా క్రమం తప్పకుండా చెల్లించడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. అలాగే ప్రీమియం చెల్లింపులను ఒకేసారి చెల్లించే అవకాశంతోపాటు పరిమిత కాలానికి లేదా యులిప్‌ మొత్తం కాలపరిమితికి చెల్లించే వీలుంది.

పెట్టుబడుల విభజన

యులిప్‌ అదరహో

యులిప్‌లో పెట్టుబడి భాగానికి సంబంధించి ఈక్విటీ లేదా డెట్‌ సాధనాల్లో మదుపు చేసే వీలుంది. రిస్క్‌ తీసుకోగలిగినవారు ఈక్విటీల్లో, పెట్టుబడికి రక్షణ కావాలనుకునేవారు డెట్‌ సాధనాల్లో మదుపు చేసే విధంగా ఎంపిక చేసుకోవచ్చు. రెండింటిలోనూ మదుపు సమానంగా ఉండేలా కూడా ఎంపిక చేసుకోవచ్చు. అలాగే ఒక దాంట్లో నుంచి మరో దాంట్లోకి మార్పులు చేసుకోవచ్చు. దీనికితోడు ఇన్వెస్టర్లు బీమాలో రైడర్లను అదనంగా తీసుకోవచ్చు. అలాగే అన్ని బీమా పాలసీల్లాగే యులిప్‌లూ.. లాయల్టీ ప్రయోజనాలు, వెల్త్‌ బూస్టర్లను అందిస్తున్నాయి.

పన్ను ఆదా

యులిప్‌ అదరహో

మిగతా అన్ని పాలసీ ప్రీమియం చెల్లింపుల మీద లభించినట్టుగానే యులిప్‌ ప్రీమియంలపైనా సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి (ఇన్వెస్టర్‌) చనిపోతే, నామినీలకు అందే బీమా మొత్తం మీద కూడా పన్ను రాయితీ ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత చేతికి వచ్చే మొత్తానికీ పన్ను రాయితీ వర్తిస్తుంది. కాబట్టి గతంతో చూస్తే ప్రస్తుతం మెరుగైన పనితీరును కనబరుస్తున్నందున యులిప్‌లను పన్ను రాయితీ, బీమా, మదుపు రాబడినిచ్చే సాధనంగా ఎంపిక చేసుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యులిప్‌ అదరహో
యులిప్‌ అదరహో
యులిప్‌ అదరహో

ట్రెండింగ్‌

Advertisement