గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 00:36:13

వాణిజ్యంపై ప్రభావమెంత?

వాణిజ్యంపై ప్రభావమెంత?
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రేపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: వాణిజ్యంపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేయడానికి మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశం అవుతున్నది. ‘నానాటికీ వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ భారతీయ ఎగుమతి/దిగుమతులను, మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యాన్ని ఏ మేరకు దెబ్బతీస్తున్నది? అన్నదానిపై మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశం జరుపుతున్నది. దీనికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలు అంతా హాజరు కావాలని కోరుతున్నాం. రాలేనివారు ఇందుకు సంబంధించి మీ దగ్గరున్న వివరాలను [email protected]కు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌లో తెలియజేశారు. 


చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. ఆ దేశ ప్రజల ప్రాణాల్నేగాక, ఆర్థిక వ్యవస్థనూ చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాణాంతక మహమ్మారికి భయపడి చైనాలోని వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతీ విదితమే. ఆసియా దేశాల్లో భారత్‌తో చైనా వాణిజ్యం పెద్ద ఎత్తున సాగుతుండగా, దానిపైనా వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. ఈ అంటువ్యాధి విస్తరించకుండా చైనాకు అన్ని దేశాలు దూరంగా ఉంటున్నాయి. కరోనా మరణాలు 1,665కు చేరగా, బాధితులు 68,500 లకు పెరిగారు. చైనాలోనే మృ తులు, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మరోవైపు ఈ ఏడాది కరోనా వైరస్‌ ప్రపంచ వృద్ధిని దెబ్బ తీయగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి  అంచనా వేస్తున్నది. 0.1-0.2 శాతం పడిపోవచ్చని చెబుతున్నది.


logo
>>>>>>