ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jun 26, 2020 , 00:26:58

గణేశ ప్రతిమలూ చైనా నుంచేనా?

గణేశ ప్రతిమలూ చైనా నుంచేనా?

  • దేశ అభివృద్ధికి దోహదపడని దిగుమతులెందుకు?: నిర్మలా సీతారామన్‌ 

చెన్నై, జూన్‌ 25: చైనా వస్తు దిగుమతులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వావలంబనకు దోహదపడే వస్తువులను, ముడి పదార్ధాలను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదని, అయితే గణేశ ప్రతిమలను కూడా చైనా నుంచే దిగుమతి చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం గురించి గురువారం ఆమె వర్చువల్‌ లింక్‌ ద్వారా తమిళనాడు రాష్ట్ర శాఖ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. ‘దేశంలో ఉత్పత్తి పెంపునకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహదపడే వస్తువులను దిగుమతి చేసుకోవడంలో తప్పులేదు. 

ప్రతి ఏటా మనం గణేశ చతుర్థి పండుగ సందర్భంగా మన్నుతో తయారు చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమలను స్థానిక కుమ్మరుల నుంచి కొనుగోలుచేసే ఆనవాయితీ ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నది. కానీ నేడు వాటిని కూడా చైనా నుంచే దిగుమతి చేసుకొంటున్నాం. ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? మట్టితో మనం గణేశ ప్రతిమలను తయారుచేసుకోలేమా?’ అని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. 


logo