గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 14, 2020 , 00:40:06

బెయిల్‌ అవుట్‌కు ఓకే

బెయిల్‌ అవుట్‌కు ఓకే
  • యెస్‌ బ్యాంకు పునర్వ్యవస్థీకరణకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం
  • పెట్టుబడులకు ముందుకొచ్చిన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కోటక్‌ బ్యాంకులు
  • మారటోరియంను త్వరలో తొలగిస్తాం: నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ, మార్చి 13: యెస్‌ బ్యాంకు పునర్‌వ్యవస్థీకరణ కోసం రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రతిపాదించిన పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం వెల్లడించారు. మంత్రివర్గ సమావేశానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యెస్‌ బ్యాంకులో 49 శాతం వాటాను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొనుగోలు చేయనున్నదని, యెస్‌ బ్యాంకు పునర్‌వ్యవస్థీకరణ కోసం ఇతర పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తామని చెప్పా రు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంకును ఆర్బీఐ ఇటీవల తన ఆధీనంలోకి తీసుకోవడంతోపాటు ఆ బ్యాంకు ఖాతాల నుంచి డిపాజిటర్లు ఏప్రిల్‌ 3 వరకు రూ.50 వేల కంటే ఎక్కువ నగదును ఉపసంహరించడాని వీల్లేదని మారటోరియం విధించిన విషయం తెలిసిందే. యెస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టేవారందరికీ మూడేండ్లపాటు లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ఉంటుందని, ఈ మూడేం డ్ల కాలంలో ఆయా పెట్టుబడిదారులు తమ వాటాలను తగ్గించుకొనేందుకు వీలుండదని, అయితే ఎస్‌బీఐ విషయంలో మాత్రం ఈ లాక్‌-ఇన్‌ పిరియడ్‌ కేవలం 26 శాతం వాటాలకు మాత్రమే వర్తిస్తుందని నిర్మలా సీతారామన్‌ వివరించారు. రుణదాత అధీకృత పెట్టుబడిని రూ.1,100 కోట్ల నుంచి రూ.6,200 కోట్లకు పెంచామని, డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు యెస్‌ బ్యాంకు ను, మొ త్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ ను స్థిరీకరించాలన్న లక్ష్యం తో కేంద్ర మంత్రివర్గం ఈ పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని ఆమోదించిందని ఆమె చెప్పా రు. ఈ పునర్‌వ్యవస్థీకరణ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడ్డాక మూడురోజుల్లో యెస్‌ బ్యాంకుపై మారటోరియంను తొలగించనున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. యెస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలు కోసం రూ.7,250 కోట్లు వెచ్చించనున్నట్టు ఎస్‌బీఐ గురువారం ప్రకటించింది. తాము తొలుత అనుకొన్న రూ.2,450 కోట్ల కంటే ఇది ఎంతో ఎక్కువని ఎస్‌బీఐ పేర్కొన్నది. తాజాగా యెస్‌ బ్యాం కులో పెట్టుబడులు పెట్టేందుకు మరో నాలుగు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆర్బీఐ ప్రతిపాదించిన పునర్‌వ్యవస్థీకరణ పథకంలో భాగంగా యెస్‌ బ్యాంకులో చెరో రూ.1000 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నట్టు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు శుక్రవా రం వెల్లడించాయి. అలాగే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టేందు కు యాక్సిస్‌ బ్యాంకు, రూ.500 కోట్లు పెట్టుబడి పెటేందుకు కోటక్‌ బ్యాంకు ముందుకొచ్చాయి.


logo