సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 11, 2020 , 02:15:39

మరో రెండు బ్యాంకుల వడ్డీ కోత

మరో రెండు బ్యాంకుల వడ్డీ కోత

హైదరాబాద్‌, జూలై 10: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)తో అనుసంధానం చేసుకున్న రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించినట్లు ప్రకటించింది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ 7.60 శాతం నుంచి 7.40 శాతానికి దిగిరానున్నది. అలాగే మూడు నెలల రుణాలపై 7.10 శాతంగాను, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటును 7.25 శాతానికి తగ్గించింది. గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు వడ్డీరేట్లను తగ్గించడం బ్యాంక్‌ ఇది 13వసారి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఎంసీఎల్‌ఆర్‌ని 5 బేసిస్‌ పాయింట్లు కోత విధించింది. కొత్త రేటు ఈ నెల 12 నుంచి వర్తిస్తుంది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.65 శాతం నుంచి 7.60 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.50 శాతం నుంచి 7.45 శాతానికి వచ్చింది.       


logo