ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 11, 2020 , 02:33:46

యూనియన్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ కట్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ కట్‌

హైదరాబాద్‌: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ మరోసారి తన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 15 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. మంగళవారం నుంచి అమలులోకి రానున్న ఈ తగ్గింపు అన్ని రకాల రుణాలకు వర్తించనున్నది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.40 శాతం నుంచి 7.25 శాతానికి దిగిరానున్నది. అలాగే మూడు నెలల రుణాలపై వడ్డీని 6.95 శాతానికి, ఆరు నెలల రుణాలపై వడ్డీని 7.10 శాతానికి కుదించింది. గతేడాది జూలై నుంచి వడ్డీరేట్లను తగ్గించడం ఇది 14వ సారి కావడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్‌ కూడా తన ఎంసీఎల్‌ఆర్‌ని 10 బేసిస్‌ పాయింట్లు కోత విధించింది.


logo