శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 26, 2020 , 00:25:50

ఐసీఐసీఐ బ్యాంక్‌ జోరు

ఐసీఐసీఐ బ్యాంక్‌ జోరు
  • క్యూ3లో రెండింతలైన లాభాలు
  • రూ.4,146.46 కోట్లుగా నమోదు

ముంబై, జనవరి 25: ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం రెండింతలకుపైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.4,670.10 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే వ్యవధిలో రూ.1,874.33 కోట్లుగా ఉన్నది. స్టాండలోన్‌ ఆధారంగా ఈసారి రూ.4,146.46 కోట్లు, పోయినసారి రూ.1,604.91 కోట్లుగా ఉన్నట్లు శనివారం ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ప్రకటించింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం గతంతో పోల్చితే 24 శాతం పెరిగి రూ.8,545 కోట్లుగా నమోదైంది. ఇతరత్రా ఆదాయం కూడా 18.77 శాతం ఎగబాకి రూ.4,043 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (మొండి బకాయిలు లేదా జీఎన్‌పీఏ) నిష్పత్తి పోయినసారి 7.75 శాతంగా ఉంటే, ఈసారి 5.95 శాతంగా ఉన్నది. 


logo