బుధవారం 24 ఫిబ్రవరి 2021
Business - Dec 19, 2020 , 01:43:05

అత్యంత సంపన్న బ్యాంకర్‌గా ఉదయ్‌ కొటక్‌

అత్యంత సంపన్న బ్యాంకర్‌గా ఉదయ్‌ కొటక్‌

న్యూఢిల్లీ: ఉదయ్‌ కొటక్‌ చరిత్రను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల బ్యాంకర్ల జాబితాలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చీఫ్‌ ఉదయ్‌ కొటక్‌ తొలి స్థానంలో నిలిచారు. 16 బిలియన్‌ డాలర్ల సంపదతో ఈ స్థానం లభించిందని బ్లూంబర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది. 61 ఏండ్ల వయస్సు కలిగిన ఉదయ్‌..చిన్నతనంలో క్రికెట్‌ ఆడుతున్నప్పుడు పెద్ద ప్రమాదం జరిగింది. బాల్‌ వచ్చి తలకు తగలడంతో అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. దీంతో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ అవ్వాలన్న ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాతి క్రమంలో ముంబైలో ఉన్న జమన్‌లాల్‌ బజాజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పట్టాపొందిన ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ను ప్రారంభించారు. 


VIDEOS

logo