ఆదివారం 31 మే 2020
Business - May 21, 2020 , 23:46:57

హైదరాబాద్‌లో ఉబర్‌ కనెక్ట్‌ సేవలు

హైదరాబాద్‌లో ఉబర్‌ కనెక్ట్‌ సేవలు

న్యూఢిల్లీ: ఉబర్‌ ఇటీవల ప్రారంభించిన ప్యాకేజ్‌ డెలివరీ సేవలను మరో ఐదు నగరాలకు విస్తరించింది. హైదరాబాద్‌తోపాటు న్యూఢిల్లీ, చెన్నై, నోయిడా, చండీగడ్‌లలో గురువారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద గత వారం కోల్‌కతా, జైపూర్‌, గుర్గావ్‌లో ప్రారంభించిన సేవలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో వీటిని ఇతర నగరాలకు విస్తరించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 


logo