గురువారం 13 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 03:30:58

విదేశీ నిల్వల జోరు

విదేశీ నిల్వల జోరు

ముంబై: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. జూలై 24తో ముగిసిన వారాంతానికిగాను మరో 4.99 బిలియన్‌ డాలర్లు పెరిగి రికార్డుస్థాయి 522.63 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్‌ వెల్లడించింది. రూపాయి బలపడటం, పసిడి రిజర్వుల విలువ అంతకంతకు పెరుగడం వల్లనే రిజర్వులు దూసుకుపోతున్నాయని ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 480.48 బిలియన్‌ డాలర్లకు, పసిడి రిజర్వులు 36.10 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 


logo