గురువారం 04 జూన్ 2020
Business - Apr 07, 2020 , 18:25:53

జీతాలు చెల్లించలేక చిన్న కంపెనీల ఇబ్బందులు

జీతాలు చెల్లించలేక చిన్న కంపెనీల ఇబ్బందులు

హైదరాబాద్: భారతదేశంలోని లక్షలాది చిన్నవ్యాపారాలు, పరిశ్రమలు మంగళవారం జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డట్టు వార్తలు వెలువడుతున్నాయి. చాలా చిన్నకంపెనీలు జీతాలను మొత్తంగా వాయిదా వేయడమో లేక కోతపెట్టడమో జరిగింది. 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ ఫలితంగా అత్యవసర సర్వీసులు తప్ప మిగతా అన్ని వ్యాపారాలు ఆగిపోయాయి. దీని ఫలితంగా జీతాల రోజైన ఏడోతేదీ అనేకమంది కార్మికులు అసలు జీతాలు అందుకోకపోవడమో, తగ్గించిన జీతం అందుకోవడమో జరిగింది. సాధారణంగా మనదేశంలో 7వ తేదీని జీతాల రోజుగా పాటిస్తారు. తమ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది నెలవారీ జీతాలు చెల్లించలేక ఇబ్బందిపడుతున్నారని అఖిలభారత ఉత్పాదకుల సంఘం వెల్లడించింది. మరోవైపు వలస కార్మికులు పనిలేక వేరే ఆదాయవనరు లేక సతమతమవుతున్నారు. లాక్‌డౌన్ పొడిగిస్తారనే పుకార్ల మధ్య గందరగోళం కొనసాగుతున్నది.


logo