న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ డ్యూకాటీ..దేశీయ మార్కెట్లోకి మరో రెండు సూపర్ బైకులను విడుదల చేసింది. వీటిలో రూ.18 లక్షల ధర కలిగిన ఎక్స్డియావెల్ మోడల్ ఒకటి కాగా, రూ.22.60 లక్షల విలువైన ఎక్స్డియావెల్ బ్లాక్ స్టార్ మోడళ్ళు ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలతో తయారైన ఈ బైకు 160 హెచ్పీ ఇంజిన్తో రూపొందించింది సంస్థ.