గురువారం 28 మే 2020
Business - Apr 29, 2020 , 15:51:28

స్పైస్ జెట్ పైలట్లకు రెండు నెలల జీతాల కోత‌

స్పైస్ జెట్ పైలట్లకు రెండు నెలల జీతాల కోత‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్ విమాన‌యాన రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. దీని వ‌ల్ల సంస్థ‌లు భారీ న‌ష్టాల్లోకి జారుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి స్పెస్ జెట్ త‌మ  పైలట్లకు ఏప్రిల్, మే నెలల జీతాలు చెల్లించేది లేదని తెలిపింది. అయితే  కార్గో విమానాలు నడిపిస్తున్న  పైలట్లకు వేత‌నాల్లో కోత‌పెట్ట‌లేదు. అది కూడా విమానాలు నడిపిన గంటలకు లెక్కగట్టి చెల్లింపులు ఉంటాయని తెలిపింది. ఈ మేర‌కు తమ పైలట్లకు సంస్థ ప్ర‌తినిధులు లేఖ రాశారు. అయితే విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు సడలించిన వెంటనే సర్వీసులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.  భారత విమానయాన సంస్థల్లో అత్యంత చౌకగా సేవలు అందించే స్పైస్‌జెట్‌ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇదిలా ఉండ‌గా ఇండిగో మాత్రం  మెజారిటీ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల పూర్తి జీతం ఇస్తామని ఇది వ‌ర‌కే ప్రకటించింది.


logo