e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News ఐటీ రూల్స్‌పై దిగొచ్చిన ట్విట్ట‌ర్.. ఏం జ‌రిగిందంటే!

ఐటీ రూల్స్‌పై దిగొచ్చిన ట్విట్ట‌ర్.. ఏం జ‌రిగిందంటే!

ఐటీ రూల్స్‌పై దిగొచ్చిన ట్విట్ట‌ర్.. ఏం జ‌రిగిందంటే!

న్యూఢిల్లీ: ఎట్ట‌కేల‌కు మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ దిగి వ‌చ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా అమ‌లులోకి తెచ్చిన ఐటీ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది. ఐటీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తాత్కాలిక చీఫ్ కంప్లియెన్స్ ఆఫీస‌ర్‌ను నియ‌మిస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం తెలిపింది. ఈ మేర‌కు పూర్తి వివ‌రాల‌ను ఐటీ మంత్రిత్వ‌శాఖ‌తో షేర్ చేసుకుంటామ‌ని పేర్కొంది.

త‌క్ష‌ణం నూత‌న ఐటీ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేసేందుకు చివ‌రి అవ‌కాశం ఇస్తున్నామ‌ని పేర్కొంటూ ట్విట్ట‌ర్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. లేని ప‌క్షంలో ఐటీ చ‌ట్టం కింద ట్విట్ట‌ర్‌కు గ‌ల మిన‌హాయింపులు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.

- Advertisement -

మ‌రోవైపు, ట్విట్ట‌ర్‌కు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 18న త‌మ ముందు విచార‌ణ‌కుహాజ‌రు కావాల‌ని ఆదేశించింది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై ట్విటర్‌ ప్రతినిధి ప్రణాళికతో రావాలని కమిటీ తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐటీ రూల్స్‌పై దిగొచ్చిన ట్విట్ట‌ర్.. ఏం జ‌రిగిందంటే!
ఐటీ రూల్స్‌పై దిగొచ్చిన ట్విట్ట‌ర్.. ఏం జ‌రిగిందంటే!
ఐటీ రూల్స్‌పై దిగొచ్చిన ట్విట్ట‌ర్.. ఏం జ‌రిగిందంటే!

ట్రెండింగ్‌

Advertisement