Sports look TVS Rider | ప్రముఖ టూ వీలర్స్ సంస్థ టీవీఎస్ మోటార్స్ విపణిలోకి 125సీసీ సామర్థ్యంతో సరికొత్త రైడర్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.77,500గా నిర్ణయించారు. యువతను ఆకర్షించడానికి స్పోర్ట్స్ బైక్ లుక్స్‌తో ఈ రైడర్‌ను రూపొందించారు. ఇప్పటికే 35 శాతం మంది యువకులు 125 సీసీ సెగ్మెంట్ బైక్స్ కొనుగోలు చేస్తున్నారని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. భారత్‌తోపాటు సార్క్ దేశాలు, లాటిన్ అమెరికా దేశాల్లోనూ ఈ బైక్ విక్రయిస్తామని వెల్లడించింది.
సరికొత్త లుక్స్‌తో డిజైన్ చేసిన ఈ బైక్‌లో డీఆర్ఎల్తో అమర్చిన సరికొత్త హెడ్‌ల్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా కానుంది. రైడర్ 125 సీసీ ని ఫ్యూయల్ ట్యాంక్, ఇంజిన్ గార్డ్ ప్రత్యేక డిజైన్లతో రూపొందించారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తోపాటు అమర్చిన స్ప్లిట్ సీట్ రైడర్లకు సౌలభ్యంగా ఉంటుంది. ఇది పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటారు. గేర్‌షిఫ్ట్ ఇండికేటర్,సగటు వేగం నమోదు చేసే ఇండికేటర్ వంటివి ఉన్నాయి.
124.8 సీసీ సింగిల్ సిలిండర్ 3 వాల్వ్ సామర్థ్యం గల ఇంజిన్‌ను అమర్చించింది టీవీఎస్ మోటార్స్. ఇది 7,500 ఆర్పీఎం వద్ద 11.2 బీహెచ్పీ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 11.2 బీహెచ్పీ టార్చ్‌ను విడుదల చేస్తుంది.