శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Mar 11, 2020 , 00:20:26

టీసీఎస్‌ రూ.12 మధ్యంతర డివిడెండ్‌

టీసీఎస్‌ రూ.12 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ, మార్చి 10: దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. మంగళవారం సమావేశమైన బోర్డు రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.12 లేదా 1200 శాతం మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి ఇందుకు సంబంధించి చెల్లింపులు జరుపనున్నట్లు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

రెండోసారి డివిడెండ్‌ ప్రకటించిన టీవీఎస్‌

ప్రముఖ ద్విచక్ర వాహన విక్రయ సంస్థ టీవీఎస్‌ మోటర్‌ కేవలం నెల రోజుల్లోనే రెండోసారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. గత నెలలో వాటాదారులకు షేరుకు ఒక్కంటికి రూ.2.1 చెల్లించిన సంస్థ..మరోసారి రూ.1.40 చెల్లించబోతున్నది. ఇందుకు సంబంధించి ఈ నెల 20 తర్వాత వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపులు జరుపబోతున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. మంగళవారం సమావేశమైన బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండోసారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించారు. రూపాయి ముఖ విలువ కలిగిన 47,50,87,114 ఈక్విటీ షేర్లకు గాను రూ.1.40 లేదా 140 శాతం డివిడెండ్‌ రూపంలో చెల్లించనున్నరన్న మాట. ఇందుకోసం రూ.80 కోట్ల నిధులను వెచ్చించనున్నది.  logo