మంగళవారం 02 మార్చి 2021
Business - Feb 05, 2021 , 01:30:43

టీవీఎస్‌ నుంచి ఈ-స్కూటర్‌

టీవీఎస్‌ నుంచి ఈ-స్కూటర్‌

  • ధర రూ.1.08 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: టీవీఎస్‌ మోటార్‌..మార్కెట్లోకి ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ పేరుతో విద్యుత్‌తో నడిచే స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో ఈ స్కూటర్‌ ధరను రూ.1,08,012గా నిర్ణయించింది. 4.4 కిలోవాట్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ కలిగిన ఈ స్కూటర్‌ గంటకు 78 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నది. కేవలం 4.2 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్‌ను ఒక్కసారి రీచార్జి చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. రిమోట్‌ బ్యాటరీ చార్జి స్టాటస్‌, నావిగేషన్‌,ఇన్‌కమింగ్‌ కాల్స్‌/ ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ వంటి ఫీచర్స్‌ దీంట్లో ఉన్నాయి.  కంపెనీ వెబ్‌సైట్‌ లేదా ఎంపిక చేసిన డీలర్ల వద్ద రూ.5 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. 


VIDEOS

logo