ఆదివారం 31 మే 2020
Business - Apr 19, 2020 , 00:22:03

టీవీఎస్‌ చేతికి బ్రిటన్‌ కంపెనీ

టీవీఎస్‌ చేతికి బ్రిటన్‌ కంపెనీ

  •  రూ.153 కోట్ల డీల్‌తో నార్టన్‌ మోటర్‌సైకిల్స్‌ కైవసం

చెన్నై, ఏప్రిల్‌ 18: దేశంలోని ప్రముఖ ద్విచక్రవాహన సంస్థల్లో ఒకటైన టీవీఎస్‌ మోటర్‌ తాజాగా మరో టూవీలర్‌ కంపెనీని కొనుగోలు చేసింది. దాదాపు రూ.153 కోట్లు (1.6 కోట్ల పౌండ్లు) వెచ్చించి బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ నార్టన్‌ను హస్తగతం చేసుకొన్నది. ఈ డీల్‌ నగదు రూపంలో జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్‌లో నార్టన్‌కు చెందిన ఆస్తులను, బ్రాండ్లను అక్కడి టీవీఎస్‌ అనుబంధ స్వాధీనం చేసుకోనున్నది. ఇటీవల తాము కొనుగోలు చేసిన కంపెనీల్లో నార్టన్‌ ఎంతో ప్రత్యేకమైనదని, నార్టన్‌ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నదని టీవీఎస్‌ పేర్కొన్నది. ఈ డీల్‌తో తమకు అంతర్జాతీయ ద్విచక్రవాహన మార్కెట్లో అపార అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదర్శన్‌ వేణు తెలిపారు. నార్టన్‌ సంస్థను 1898లో జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ బర్మింగ్‌హామ్‌లో నెలకొల్పారు.


logo