సోమవారం 01 మార్చి 2021
Business - Jan 31, 2021 , 22:46:48

ఫ్యామిలీ పెన్ష‌న్ ప్ల‌స్ ఐసీఐసీఐ బ్యాంక్‌ రూప‌శిల్పి కృష్ణమాచారి

ఫ్యామిలీ పెన్ష‌న్ ప్ల‌స్ ఐసీఐసీఐ బ్యాంక్‌ రూప‌శిల్పి కృష్ణమాచారి

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం దేశీయంగా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా విరాజిల్లుతున్న ఐసీఐసీఐతోపాటు ప్ర‌భుత్వ రంగ ఆర్థిక సంస్థ‌లైన ఐడీబీఐ, యూటీఐల రూప‌శిల్పి టీటీ కృష్ణమాచారి. 1957-58, 1962-66 వ‌ర‌కు రెండు ద‌ఫాలుగా ఆర్థిక‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన టీటీ కృష్ణమాచారి.. దేశంలో మూడు ప్ర‌ధాన ఉక్కు ఫ్యాక్ట‌రీల‌ను ఏర్పాటు చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చాలంటే కొత్త ప‌న్నుల‌ను వ‌డ్డించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పిన విత్త‌మంత్రి. 

నూత‌న బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించ‌డానికి ముందు కూడా ప‌న్నులు విధించొచ్చున‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంత‌టితో ఆగ‌క ప‌న్నుల రంగంలో స‌మూల సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం కూడా చుట్టారు. తొలుత 1957-58లో ఆర్థిక మంత్రిగా ప‌ని చేసిన కృష్ణమాచారి.. అవినీతికి పాల్ప‌డిన‌ట్లు జ‌స్టిస్ చ‌గ్లా క‌మిష‌న్ నిర్ధారించ‌డంతో రాజీనామా చేశారు. 

తిరిగి 1964-65, 1965-66 ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు బ‌డ్జెట్లు స‌మ‌ర్పించిన క్రుష్ణ‌మాచారి.. సామాజిక భ‌ద్ర‌త‌కు క‌ల్ప‌న అవ‌స‌రం ఉంద‌ని అభిల‌షించారు. అప్ప‌ట్లో నూత‌న ఫ్యామిలీ పెన్ష‌న్ స్కీమ్‌-1964ను ప్ర‌వేశ‌పెట్టింది కూడా ఆయ‌నే. దీని ద్వారా మ‌ర‌ణించిన ప్ర‌భుత్వోద్యోగుల కుటుంబ స‌భ్యుల‌కు పెన్ష‌న్ విస్త‌రించారు. రాజ‌స్థాన్ కెనాల్ స్కీమ్‌లు, దండ‌కార‌ణ్య‌, దామోద‌ర్ వ్యాలీ ప్రాజెక్టులు, నైవేలీ లిగ్నైట్ ప్రాజెక్టుల‌ను రూపొందించ‌డంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 1966లో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

తాజావార్తలు


logo