స్టార్టప్‌లకు టీఎస్ఐసీ దన్ను

- గ్రామీణ స్థాయిలో నూతన మార్పులకు శ్రీకారం
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ).. స్టార్టప్‌లకు ఊతమిస్తున్నది. గ్రామీణ స్థాయిలో నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే ‘ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమంతో టీఎస్ఐసీ విజయాన్ని అందుకోగా, కరోనా నేపథ్యంలో దాదాపు 100 స్టార్టప్‌లకు దన్నుగా నిలిచి ఔత్సాహికులను ప్రోత్సహించింది. Rejig. Hydstartups ద్వారా చేయూతనిచ్చింది. మదుపరులు, కార్పొరేట్లతో స్టార్టప్‌లను అనుసంధానపర్చడంలో కీలకపాత్ర పోషించింది. Rejig. Hydstart ups వేదికగా ఆవిష్కార్, యాక్సెల్, ఆరళి వెంచర్స్, అంకుర్ క్యాపిటల్, ఆర్థ వెంచర్స్, ఎండియా పార్ట్నర్స్, హైదరాబాద్ ఏంజెల్స్, ఐఏఎన్ తదితర ఇన్వెస్టర్ నెట్వర్క్స్, వెంచర్ క్యాపిటలిస్టులతో స్టార్టప్‌లు నిలదొక్కుకున్నాయి.
వెలుగులోకి ప్రతిభ
ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ 2017లో రాష్ట్ర ఇన్నోవేషన్ పాలసీ కింద టీఎస్ఐసీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని టీ-హబ్ సీఈవో రవీ నారాయణ్.. టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా ఉన్నారు. నూతన ఆవిష్కరణల కోసం కృషి చేస్తున్న టీఎస్ఐసీ.. రాష్ట్ర సంస్కృతికీ పెద్దపీట వేస్తున్నది. ఇక గ్రామీణ స్థాయి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేలా సరికొత్త కార్యక్రమాలనూ టీఎస్ఐసీ రూపొందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా టీ-ఇన్నోవేషన్ యాత్రను నిర్వహించగా, అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) పేరుతో ఇన్నోవేటర్లందరినీ ఏకం చేసి యువతను ఆకట్టుకున్నది.
తాజావార్తలు
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం