ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 18, 2020 , 00:51:13

హైదరాబాద్‌-బెల్గామ్‌ మధ్య ట్రూజెట్‌

 హైదరాబాద్‌-బెల్గామ్‌ మధ్య ట్రూజెట్‌

హైదరాబాద్‌, జనవరి 17:ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉడాన్‌ స్కీంలో భాగంగా రాష్ర్టానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ట్రూజెట్‌ మరో మూడు కొత్త రూట్లకు రోజువారి సేవలను ఆరంభించింది. వీటిలో బెల్గామ్‌ నుంచి తిరుపతి, మైసూరు, హైదరాబాద్‌ రూట్లకు నూతన విమాన సర్వీసులను శుక్రవారం ప్రారంభించింది. వీటిలో బెల్గామ్‌లో మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్న ట్రూజెట్‌ విమాన సర్వీసు హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2.25 గంటలకు చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు బెల్గామ్‌కు చేరుకోనున్నది. 


logo