జడ్చర్లలో ట్రౌ ప్లాంట్

- రూ.90 కోట్లతో ఏర్పాటు చేసిన నెదర్లాండ్స్ కంపెనీ
నమస్తే తెలంగాణ, బిజినెస్ బ్యూరో: పశు పోషణ పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ట్రౌ న్యూట్రిషన్ ఉత్పత్తులు.. ఇక తెలంగాణ వేదికగా భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని జడ్చర్లలో తమ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నెదర్లాండ్స్‌కు చెందిన న్యూట్రికో గ్రూప్ బుధవారం ప్రకటించింది. న్యూట్రి కో ద్వారా విడుదలవుతున్న రెండు ప్రముఖ బ్రాండ్ల లో ఒకటి ట్రౌ న్యూట్రిషన్. నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంట్‌లో ఇప్పటికే సన్నాహక స్థాయిలో వాణిజ్యపరమైన ఉత్పత్తి చేస్తున్నారు. భారత్‌లో నెదర్లాండ్స్ రాయబారిగా వ్యవహరిస్తున్న మార్టిన్ వాన్ డెన్ బర్గ్ ఈ నెల 7న ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. దేశంలోనే తమ తొలి ప్లాంట్‌ను తెలంగాణలో ఆవిష్కరిస్తున్న న్యూట్రికో.. ఇందుకోసం దాదాపు రూ.89 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.
దక్షిణాసియా మార్కెట్లోకి
దక్షిణాసియా దేశాల్లో మార్కెటింగ్ వ్యూహంతో జడ్చర్ల ప్లాంట్‌ను న్యూట్రికో నెలకొల్పడం గమనార్హం. ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉత్పాదక కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. సంపూర్ణ పోషకాలతో దాణాను తయారుచేసి పశు సంపదను పెంపొందించడమే లక్ష్యంగా మార్కెట్లోకి విభిన్న ఉత్పత్తులను న్యూట్రికో విడుదల చేస్తున్నది. 20వేల మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో వస్తున్న ఈ ప్లాంట్‌లో ప్రాథమికంగా విటమిన్లు, మినరల్ ప్రీమిక్సెస్, బ్లెండ్స్ వంటి వాటిని ఉత్పత్తి చేయనున్నారు. మానవ ప్రమేయం లేకుండా మొత్తం యంత్రాల సాయంతోనే దాణాను ప్యాకింగ్ చేయనుండటం విశేషం.
2025 నాటికి పూర్తిస్థాయి విస్తరణ
జడ్చర్ల ప్లాంట్‌ను 2025 నాటికి పూర్తిస్థాయిలో విస్తరిస్తామన్న ఆశాభావాన్ని ట్రౌ న్యూట్రిషన్ వ్యక్తం చేసింది. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలకు ఎగుమతులు జరుగనున్నాయి. మరోవైపు గుజరాత్‌లోని సూరత్‌లో రెండో ప్లాంట్‌ను సంస్థ ఏర్పాటు చేయనున్నది.
తాజావార్తలు
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- పని ఉందని తీసుకెళ్లి దోపిడీ..
- యూట్యూబ్‌లో చూసి.. బైక్‌ల చోరీ
- ఇన్స్టంట్ రుణ యాప్‌లు గూగుల్ నుంచి తొలగింపు