శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 24, 2021 , 02:12:01

రైళ్లలో అరటి పండ్ల రవాణా

రైళ్లలో అరటి పండ్ల రవాణా

తొలిసారిగా శీతలీకరణ కంటైనర్లలో లోడింగ్‌

సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తొలిసారిగా రైళ్ల ద్వారా శీతలీకరణ కంటైనర్లలో అరటి పండ్లను రవాణా చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఈ అరటి పండ్లను ముంబైలోని నెహ్రూ పోర్టు ట్రస్టుకు రవాణా చేస్తున్నామని శనివారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. అక్కడి నుంచి తూర్పు దేశాలకు ఎగుమతి కానున్నాయి. సాధారణంగా అరటి పండ్లను రోడ్డు మార్గంలో రవాణా చేస్తుంటారు. అయితే అధిక సమయం పడుతుండటంతో నష్టం వాటిల్లుతున్నది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పరస్పర సహకారంతో రవాణాకు మార్గం సుగమమైంది. కాగా, రవాణా సమయంలో కంటైనర్లకు విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు లేకుండా ఉండేందుకు ప్రతీ రైలుకు 2 పవర్‌ ప్యాక్స్‌ ఏర్పాటు చేశారు. సుమారు 977 టన్నుల అరటి పండ్లను 43 రిఫ్రిజిరేటర్‌ కంటైనర్లలో లోడ్‌ చేసిన రైలు శుక్రవారం తాడిపత్రి నుంచి ముంబై పోర్టుకు బయలుదేరింది.


VIDEOS

logo