శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 26, 2020 , 23:43:55

లగ్జరీ మార్కెట్లోకి టయోటా

లగ్జరీ మార్కెట్లోకి టయోటా
  • హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ‘వల్ఫురై’ విడుదల - ధర రూ.79.50 లక్షలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: టయోటా కిర్లోస్కర్‌ కూడా విలాసవంతమైన కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌ వేదికగా తన ‘నూతన వల్ఫురై’ నూతన లగ్జరీ కారైన సెల్ఫ్‌-చార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసింది. శక్తివంతమైన డ్రైవింగ్‌ అనుభవం కలిగిన ఈ కారు తక్కువ ఫ్యూయల్‌తో ఎక్కువ మైలేజీ, తక్కువ కాలుష్యాన్ని వదలనున్న ఈ కారు 2.5 లీటర్ల ఫోర్‌-సిలిండర్‌ గ్యాసోలైన్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌తో తయారు చేసింది. 


ఈ కారు ధరను రూ.79.50 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర కొన్ని నెలలు మాత్రమే ఉండనున్నదని, ఎప్పుటి నుంచి పెంచేది మాత్రం కంపెనీ వర్గాలు వెల్లడించడానికి నిరాకరించాయి. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ  లగ్జరీ కారు లో ఉండే అన్ని రకాల ఫీచర్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా రెండోపొడువైన సీటు, వన్‌-టచ్‌ పవర్‌ సైడ్‌ డోర్లు, రెండు సన్‌రూఫ్‌, ఏడు ఎయిర్‌బ్యాగులు, 3-జోన్ల ఏసీలు, హిల్‌-స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, 17 జేబీఎల్‌ స్పీకర్లు, లీటర్‌కు 16.35 కిలోమీటర్ల  మైలేజీ ఇవ్వనున్నది.


గ్రాండ్‌ఐ10లో సరికొత్త వెర్షన్‌


ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ గ్రాం డ్‌ ఐ10 నియోస్‌ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది హ్యుందాయ్‌ మోటర్‌. ఢిల్లీ షోరూం లో ఈ కారు రూ.7.68 లక్షలకు లభించనున్నది. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన ఈ స్పోర్ట్‌ రకం కారు రూ.7.68 లక్షలకు, స్పోర్ట్‌(డ్యూయల్‌ టోన్‌) ట్రిమ్‌ మోడల్‌ రూ.7.73 లక్షలకు లభించనున్నది. 


logo