అదానీతో టోటల్ దోస్తీ

- రూ.18,320 కోట్ల డీల్
- అదానీ గ్రీన్ ఎనర్జీలో 20% వాటా కొనుగోలు
న్యూఢిల్లీ, జనవరి 18: ఫ్రెంచ్ ఆయిల్ అండ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ గ్రూప్.. అదానీ గ్రూప్‌తో జట్టు కట్టింది. రూ.18,317.5 కోట్ల (2.5 బిలియన్ డాలర్లు) డీల్‌ను కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 20 శాతం వాటాను టోటల్ కొనుగోలు చేస్తున్నది. అలాగే 2.35 గిగావాట్ల ఆపరేటింగ్ సోలార్ ఆస్తుల పోర్ట్‌ఫోలియోలో 50 శాతం వాటాను చేజిక్కించుకుంటున్నది. ఈ క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్‌కు బోర్డు సభ్యత్వం లభిస్తున్నది. ఇప్పటికే 2018లో అదానీ గ్యాస్ లిమిటెడ్‌లోని 37.4 శాతం వాటాను టోటల్ కొన్న విషయం తెలిసిందే. అంతేగాక ఒడిషాలోని ధమ్రా ఎల్ఎన్జీ ప్రాజెక్టులో 50 శాతం వాటాను సొంతం చేసుకున్నది. ఈ క్రమంలో తాజా డీల్.. టోటల్, అదానీ గ్రూప్‌ల బంధాన్ని మరింత బలపరిచిందని ఇరు సంస్థలు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశాయి. 2025కల్లా 35 గిగావాట్ల స్థూల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవాలని టోటల్ లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది చివరి నాటికి టోటల్ స్థూల విద్యుదుత్పత్తి సామర్థ్యం దాదాపు 12 గిగావాట్లుగా ఉన్నది. ఇందులో 7 గిగావాట్లు పునరుత్పాదక శక్తి. కాగా, చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుని విద్యుత్తు, పునరుత్పాదక శక్తి వైపునకు టోటల్ తమ వ్యాపార లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నది.
తాజావార్తలు
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్‌లో పెద్దపులి కలకలం
- అక్షర్‌తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
- చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ 75 నిమిషాల సంభాషణ