సోమవారం 13 జూలై 2020
Business - May 31, 2020 , 00:02:59

రాష్ట్రంలో టొరెంట్‌ సీఎన్‌జీ స్టేషన్‌

రాష్ట్రంలో టొరెంట్‌ సీఎన్‌జీ స్టేషన్‌

న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టొరెంట్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ .. దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో 21 సీఎన్‌జీ విక్రయ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తర్వాత వీటిని నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఏడు రాష్ర్టాల్లో 32 జిల్లాల్లో సీఎన్‌జీ రిటైల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి లైసెన్స్‌ ఉన్నదని, కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటిలో ఉత్తర ప్రదేశ్‌లో 10, పంజాబ్‌లో నాలుగు, గుజరాత్‌లో మూడు, తెలంగాణ, రాజస్థాన్‌లలో ఒక్కో సీఎన్‌జీ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు కంపెనీ డైరెక్టర్‌ జినల్‌ మెహతా తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 200 సీఎన్‌జీ స్టేషన్లను లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ అందుకుతగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తున్నది. 


logo