శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Jan 03, 2021 , 21:32:59

భారీ ప్లాన్లలో ఎన్‌ఫీల్డ్‌, బజాజ్‌, ట్రయంఫ్‌

భారీ ప్లాన్లలో ఎన్‌ఫీల్డ్‌, బజాజ్‌, ట్రయంఫ్‌

న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం ప్రభావంతో గతేడాది చతికిల పడ్డ ఆటోమొబైల్‌ రంగం.. ప్రత్యేకించి టూ వీలర్స్‌ సెగ్మెంట్‌ 2021లో పుంజుకోనున్నది. కొవిడ్‌-19 నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వాడకానికి ప్రాధాన్యం పెరిగింది. కనుక ప్రధానంగా బజాజ్‌ ఆటో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, ట్రయంఫ్‌ మోటారు సైకిల్స్‌ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్రెష్‌ మోడల్‌ బైక్‌లను అభివృద్ధి చేసి మార్కెట్‌లో విడుదల చేయడానికి భారీ ప్రణాళికలే సిద్ధం చేశాయి. వాటి గురించి తెలుసుకుందాం.. 

తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా ఉత్పత్తి సాగిస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ 2021 ప్రారంభంలోనే ఆల్‌ న్యూ క్లాసిక్‌ 350 మోడల్‌ బైక్‌ ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విపణిలోకి అడుగు పెట్టనున్నదీ మోడల్‌ బైక్‌. గతంలోనూ పలు దఫాలు రోడ్లపై టెస్టింగ్‌ చేస్తూ ప్రజలను ఆకర్షించింది కూడా. 

న్యూ జనరేషన్‌ ఆర్సీ200 మోడల్‌ బైక్‌ త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. న్యూ ఆర్సీ200 అప్‌డేటెడ్‌ డిజైన్‌, స్టైలింగ్‌తో స్పోర్టీగా ఉంటుంది. అప్‌డేటెడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌తోపాటు పలు న్యూ ఫీచర్లు ఈ న్యూ ఆర్సీ 200 బైక్‌ సొంతం. 

ఇండియన్‌ మార్కెట్‌కు అప్‌ డేటెడ్‌ హోండా సీబీఆర్‌ 650ఆర్‌ వర్షన్‌ పరిచయం కానున్నది. ఈ ఏడాది మధ్యలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. దీనికి బీఎస్‌-6  సామర్థ్యంతో కూడిన పవర్‌ ట్రైన్‌తోపాటు పలు న్యూ అప్‌డేట్స్‌ ఉన్నాయి. గతేడాది చివర్లో ప్రవేశించిన హోండా సీబీఆర్‌ 650ఆర్‌ అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డులు నెలకొల్పింది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650 ట్విన్స్‌ (ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650)ను ఆవిష్కరించనున్నది. మైనర్‌ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు లభించనున్నది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650సీసీ క్రూయిజర్‌ మోడల్‌ బైక్‌ ఈ ఏడాది చివర్లో భారత్‌ మార్కెట్‌లోకి దూసుకురానున్నది. 

ఇక ట్రయంఫ్‌ ట్రిడెంట్‌ కూడా భారత విపణిలోకి రానున్నది. తొలి త్రైమాసికంలో దీనిని ఆవిష్కరిస్తారు. ఇది కవాసాకి జీ650, హోండా సీబీ650 ఆర్‌ మోడల్‌ బైక్‌లకు పోటీ ఇవ్వనున్నది. ట్రయంఫ్‌ టైగర్‌ 850 స్పోర్ట్‌ ఇప్పటికే కంపెనీ భారత వెబ్‌సైట్‌లో దర్శనమిస్తోంది. ఎంట్రీ లెవెల్‌ 900 మోటారు సైకిల్‌ స్థానే దీన్ని ఆవిష్కరించనున్నారు. మార్కెట్‌ నుంచి తప్పించిన టీఎన్టీ 300 బైక్‌ స్థానంలో బైనెల్లి 302 ఎస్‌ బైక్‌ ఈ ఏడాది చివరిలో విపణిలో ప్రవేశించనున్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo