బేషుగ్గా ఈఎంఐ చెల్లింపులుంటే.. టాప్ అప్ లోన్ ఈజీ మరీ!

న్యూఢిల్లీ: ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాలు పొందడం పెద్ద కష్టమేమీ కాదు. తగిన పత్రాలు ఉంటే ఆర్థిక సంస్థలు వ్యక్తిగత, వ్యాపార, గృహ, వాహన రుణాలు అందిస్తున్నాయి. అయితే ఇప్పటికే మీరు రుణం తీసుకున్నా.. అదనంగా డబ్బు అవసరమైతే.. రుణంపై టాప్-అప్‌లోన్ పొందొచ్చు. అదేవిధంగా ఇంటి రుణం తీసుకున్నాక ఇంకే రుణం తీసుకోవడం వీలవుతుందా అని కొంత మంది అనుకుంటారు. అయితే అదే రుణంపై మీకు టాప్ అప్ లోన్ ద్వారా మళ్లీ రుణం పొందే అవకాశం వస్తుంది.
ఇప్పటికే రుణం తీసుకుని ఉండే దానిపై అదనంగా రుణం పొందటమే టాప్అ-ప్ లోన్. ఇదేలా సాధ్యం? ఓ సారి రుణం తీసుకున్నాక మళ్ళీ రుణం తీసుకుందాం అంటే కుదురుతుందా! అది మీ అవసరం బట్టి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రుణం తీసుకోవాలనుకుంటే మాత్రం టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా తక్కువ.
టాప్-అప్ లోన్ కవసరమైన డాక్యుమెంట్లను అందజేస్తే దివరకు ఉన్న రుణంపై వడ్డీకి సమానంగా లేదా తక్కువగా ఈ రుణాలను అందిస్తారు. సాధారణంగా వ్యక్తిగత, గృహ రుణాలపై ఈ టాప్-అప్ లోన్ అందిస్తారు. ఉన్నత విద్య, పెళ్లి, ప్రయాణం, వైద్య చికిత్స వంటి అత్యవసరమైన సమయాల్లో ఈ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. టాప్-అప్ హోమ్ రుణంతో ఇంటిని ఆధునీకీకరించవచ్చు. త్వరగా రుణం పొందడంతో పాటు తక్కువ వడ్డీ రేట్ల కోసం టాప్-అప్ లోన్‌ను పరిశీలించవచ్చు.
ప్రజలు ఎక్కువగా గృహ రుణాలపై టాప్-అప్‌లోన్ తీసుకుంటున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు ఈ వసతిని కలిపిస్తున్నాయి. గృహ రుణం చెల్లించడం మొదలైన 6 -12 నెలలకు టాప్ అప్ లోన్ తీసుకునేందుకు అవకాశం కలిపిస్తున్నాయి. ఇంటికి చాలా లోన్ తీసుకున్నాం కదా మళ్ళీ లోన్ కావాలంటే బ్యాంకులు ఇస్తాయా అనే సందేహం వస్తుంది. అయితే ఇక్కడ లాజిక్ గమనిస్తే మీకు విషయం వివరంగా అర్థమవుతుంది. ఇదెలా అంటే మొత్తం తీసుకున్న గృహరుణం నుంచి తగ్గిన రుణాన్ని తీసివేస్తే వచ్చే మొత్తానికి టాప్ అప్ లోన్ ఇస్తారు. అయితే ఈ కాలంలో సదరు వ్యక్తులకు ఆదాయం పెరగడం ద్వారా రుణ మొత్తం పరిమితి పెరుగుతుంది.
సాధారణంగా టాప్-అప్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, కార్ రుణాల వడ్డీ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. కాలపరిమితి కూడా ఎక్కువ. రుణం పొందడం కూడా చాలా సులభం. గృహ ఆధునీకీకరణ, మరమ్మతులు, పిల్లల ఉన్నత విద్యకోసం డబ్బును కేటాయిస్తే దానిపై పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. అందుకే ఎక్కువగా వ్యక్తిగత రుణాల కంటే టాప్-అప్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
డబ్బు అత్యవసరమైనప్పుడు వ్యక్తిగత రుణం కంటే టాప్-అప్ లోన్ ఎంచుకోవడం మంచిది. దీని ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుంది. ఎందుకంటే రుణగ్రహీత ఇదివరకే రుణం తీసుకొని ఉన్నందున్న వారి వివరాలు అన్ని తెలుస్తాయి. చాలా వరకు బ్యాంకులు రుణం తీసుకున్న వినియోగదారులకు ప్రీ-క్వాలిఫైడ్ టాప్-అప్ ఆఫర్ ప్రకటిస్తాయి. కొన్నిసార్లు హోమ్-లోన్ మీద టాప్-అప్ లోన్ తీసుకోవానుకుంటే ఆస్తిని పునపరిశీలన చేయవలసి రావచ్చు. దీనికి వారం సమయం పట్టొచ్చు. ఇదివరకే కేవైసీ పూర్తయితే తిరిగి ఎటువంటి డాక్యుమెంట్లను సమర్పించవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా తీసుకున్న రుణాలపై పేమెంట్ హిస్టరీ బాగుంటే త్వరగా టాప్-అప్‌లోన్ అందిస్తారు.
టాప్-అప్ లోన్‌పై వడ్డీ రేట్లు తక్కువ. ఎందుకంటే మీ బ్యాంకు వద్ద ఇదివరకే మీరు తీసుకున్న రుణంపై చెల్లింపులు, సమయానికి చెల్లిస్తున్నారో లేదో తెలుస్తుంది కాబట్టి మీ రుణ చరిత్ర బాగుంటే తక్కువ వడ్డీ రేట్లను అందించే అవకాశం ఉంటుంది. సాధారణంగా గృహరుణాలపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అయితే దానిపై తీసుకునే టాప్ అప్ లోన్ పై వడ్డీ రేటు దానికంటే 0.5-1 శాతం ఎక్కవగా ఉంటుంది.
ఈ టాప్ అప్ లోన్ పొందేందుకు రుణ చరిత్ర బాగుండాలి. మీకు రుణం తీసుకునే పరిమితి ఉన్నా రుణం లభించదు. మీ పాత రుణాల చెల్లింపుల తీరును బట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తుంటాయి. గృహ రుణంపై టాప్-అప్ లోన్ తీసుకునే మీకు ముందుగా ఇచ్చిన రుణం కంటే తక్కువగా ఉంటుంది. ఎంత ఇవ్వాలన్నది బ్యాంకు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇది లక్షల నుంచి రూ. కోటి వరకు కూడా ఉండొచ్చు. గృహ రుణ విషయంలో అయితే మీ ఆస్తి విలువలో 70-80 శాతానికి మించి టాప్-అప్‌లోన్ అందించరు.
ఇక టాప్ -అప్ రుణ చెల్లింపులకు గడువు 20 ఏళ్ల వరకు గానీ, మీ గృహ రుణం మొత్తం పూర్తయ్యే వరకు ఉంటుంది. ఎంత కాలపరిమితి అన్నది బ్యాంకు నిర్ణయిస్తుంది. మీ ఆదాయం, వయసు, ఆస్తి విలువ వీటిని పరిశీలించి బ్యాంకు రుణం పంపిణీ చేస్తుంది.టాప్-అప్ రుణం కోసం దాఖలు చేసేటప్పుడు మీ రుణ చరిత్ర బాగుండేలా చూసుకోవాలి. కాలపరిమితి కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ ప్రొఫైల్, క్రెడిట్ హిస్టరీ కూడా కీలకం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు