శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 24, 2020 , 13:31:24

త్వ‌ర‌ప‌డండి.. కార్ల‌పై భారీ డిస్కౌంట్లు

త్వ‌ర‌ప‌డండి.. కార్ల‌పై భారీ డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: 2020 ఏడాది పూర్త‌వుతున్న వేళ ప‌లు కంపెనీలు త‌మ కార్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇయ‌ర్ ఎండ్ సేల్‌లో భాగంగా మారుతీ సుజుకి, హ్యుండాయ్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హోండాలాంటి కంపెనీలు ఇప్పటికే త‌మ హ్యాచ్‌బ్యాక్‌, ఎస్‌యూవీలు, ఎంపీవీల‌పై డిస్కౌంట్లు ప్ర‌క‌టించాయి. ఏ కంపెనీ ఏ కారుపై ఎంత ధ‌ర త‌గ్గించిందో ఇక్క‌డ చూడండి.

మారుతీ సుజుకి

ఇండియాలో అమ్ముడుపోయే కార్ల‌లో చాలా వ‌ర‌కూ మారుతీ సుజుకీవే ఉంటాయి. మిడిల్ క్లాస్‌కు అందుబాటు ధ‌ర‌ల్లో ఉండే ఈ కార్లు.. ఇప్పుడు డిస్కౌంట్ల‌తో మ‌రింత మంది కస్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. మారుతీ త‌మ బెస్ట్ సెల్లింగ్ ఆల్లో నుంచి ప్రీమియం ఎస్‌యూవీ ఎస్‌-క్రాస్ వ‌ర‌కు డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. స్విఫ్ట్ మోడ‌ల్‌పై రూ.45 వేలు, డిజైర్‌పై రూ.35,500, ఎర్టిగాపై రూ.6 వేలు, బాలెనోపై రూ.31 వేలు, సియాజ్‌పై రూ.61 వేల డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది మారుతి.

హ్యుండాయ్‌

మారుతీ త‌ర్వాత ఆ స్థాయిలో కార్ల అమ్మ‌కాలు ఉన్న సౌత్ కొరియా సంస్థ హ్యుండాయ్‌.. ఇయ‌ర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ. ల‌క్ష వ‌ర‌కూ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. సాంత్రో కారు కొనాల‌నుకుంటే రూ.50 వేల వ‌ర‌కూ త‌గ్గింపు ల‌భిస్తోంది. ఇక గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.60 వేలు, గ్రాండ్ ఐ10పై రూ.60 వేలు, ఆరాపై రూ.70 వేలు, ఎలాంట్రాపై రూ.ల‌క్ష డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. 

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా

ఈ సంస్థ అత్య‌ధికంగా తమ కార్ల‌పై రూ.3.06 ల‌క్ష‌ల వ‌ర‌కూ డిస్కౌంట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ భారీ త‌గ్గింపు మ‌హీంద్రా ఆల్టుర‌స్ జీ4 మోడ‌ల్ కొన్న వారికి ల‌భిస్తుంది. ఇక కేయూవీ100 ఎన్ఎక్స్‌టీపై రూ.62 వేలు, ఎక్స్‌యూవీ300పై రూ.29,500, బొలెరోపై రూ.20 వేలు, స్కార్పియోపై రూ.60 వేలు, మ‌రాజోపై రూ.41 వేలు, ఎక్స్‌యూవీ500పై రూ.56 వేల డిస్కౌంట్లు ఇస్తోంది.

హోండా

హోండా కార్లు కూడా ఇయ‌ర్ ఎండ్ సేల్‌లో భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. క‌నిష్ఠంగా రూ.15 వేలు, గ‌రిష్ఠంగా రూ.2.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ గ‌రిష్ఠ త‌గ్గింపును ఎక్స్‌చేంజ్‌, క్యాష్ డిస్కౌంట్లు క‌లిపి పొంద‌వ‌చ్చు. ఇక ఆ సంస్థ అమేజ్‌పై రూ.37 వేలు, హోండా సిటీ 5వ జ‌న‌రేష‌న్‌పై రూ.30 వేలు, హోండా డ‌బ్ల్యూఆర్‌-వీపై రూ.40 వేలు, జాజ్‌పై రూ.40 వేలు, సివిక్‌పై రూ.ల‌క్ష డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.


ఇవి కూడా చ‌ద‌వండి

క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవి? న‌ష్టం ఎంత‌?

‘కొవాగ్జిన్‌’తో ఏడాది వరకు యాంటీబాడీలు : భారత్‌ బయోటెక్‌

పారిస్ ఒప్పందం లక్ష్యాల దిశగా భార‌త్ : ప‌్ర‌ధాని మోదీ

VIDEOS

logo