కంపాక్ట్ సెడాన్ కింగ్ ‘మారుతి డిజైర్’

న్యూఢిల్లీ: దేశంలోని కార్ల తయారీ సంస్థల్లో మారుతి సుజుకికి చెందిన డిజైర్ మోడల్ కారు కంపాక్ట్ సెడాన్ విభాగంలో రారాజుగా కొనసాగుతున్నది. గత నెలలో కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్ల విక్రయంలో మారుతి సుజుకి ‘డిజైర్’ మొదటి స్థానంలో నిలువగా, తర్వాతీ స్థానాల్లో హోండా అమేజ్, హ్యుండాయ్ ఔరా ఉన్నాయి.
నవంబర్ నెలలో కంపాక్ట్ సెడాన్ కార్లు అత్యధికంగా అమ్ముడైన వాటిలో మారుతి సుజుకి ‘డిజైర్’ ఉంది. గత నెలలో మొత్తం 13,356 యూనిట్ల కార్లు వినియోగదారులు కొనుగోలు చేశారు. కే సిరీస్ డ్యూయల్-జెట్ డ్యుయల్-వీవీటీ 1.2-లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం దీనిసొంతం. ఇది గరిష్ఠంగా 90హెచ్‌పీ పవర్, 113ఎన్ఎం పీక్ టార్చి విడుదల చేస్తున్నది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఏజీఎస్ (ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్) వర్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. ఇక ఈ కారు రూ. 5.89 లక్షల నుంచి రూ.8.80 లక్షల మధ్య లభిస్తున్నది.
మారుతి సుజుకి తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన కంపాక్ట్ సెడాన్ కారు హోండా అమేజ్. గత నెలలో ఈ మోడల్ కారును 4,706 మంది కొనుగోలు చేశారు. అమేజ్ మోడల్ కారుల పలు పవర్ ట్రైన్ ఆప్షన్లు కలిగి ఉంది. 1.2 లీటర్లతోపాటు ఐ-వీటెక్ పెట్రోల్ సామర్థ్యం గల ఇంజిన్ ఇందులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 90పీఎస్ విద్యుత్. 110ఎన్ఎం పీక్ టార్చి వెలువరిస్తుంది.
అంతేకాదు హోండా అమేజ్ 5-స్పీడ్ ఎంటీ, ఆటోమేటిక్ సీవీటీ వర్షన్లలో లభ్యమవుతుంది. 1.5-లీటర్ల సామర్థ్యం గల ఐ-డీటీఈసీ డీజిల్ మోటార్ ఇందులో అమర్చారు. ఇది 100 పీఎస్ పవర్, 200ఎన్ టార్చి/ ఆటోమేటిక్ సీవీటీ వర్షన్ కారు ఇంజిన్ 80పీఎస్ విద్యుత్, 160ఎన్ఎం టార్చి వెలువరించే సామర్థ్యం కలిగి ఉంది. హోండా అమేజ్ కారు రూ. 6.17 లక్షలకు, రూ. 9.99 లక్షలకు వినియోగదారులకు లభిస్తుంది.
కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్ల విక్రయంలో హ్యుండాయ్ ఔరా మూడో స్థానంలో ఉంది. గత నెలలో ఈ మోడల్ కార్లు 3,063 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది పలు ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంది. 5-స్పీడ్ ఎంటీ అండ్ ఏఎంటీ ఆప్షన్లతో 1.2 కప్యా డ్యుయల్ వీటీవీటీ పెట్రోల్ (83పీఎస్ అండ్ 114ఎన్ఎం) నియోగదారులకు లభిస్తుంది.
ఇంకా 5-స్పీడ్ ఎంటీ ఆప్షన్లో 1.2 కప్పా బయో ఫ్యుయల్ పెట్రోల్/సీఎన్జీ (69పీఎస్ అండ్ 95ఎన్ఎం ఇన్ సీఎన్జీ), 5-స్పీడ్ ఎంటీ ఆప్షన్లో 1.0 టర్బో జీడీఐ పెట్రోల్ (100 పీఎస్ అండ్ 172ఎన్ఎం), 5-స్పీడ్ ఎంటీ అండ్ ఏఎంటీ ఆప్షన్లతోపాటు 1.2 యూ2 సీఆర్డీఐ (75పీఎస్ అండ్ 190ఎన్ఎం) వర్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. హ్యుండాయ్ ఔరా ధర రూ.5.86 లక్షల నుంచి రూ.9.28 లక్షల మధ్య పలుకుతోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఆంక్షలతో విసిగి : ఇండ్ల నుంచి పారిపోయిన నలుగురు బాలికలు!
- కూతురితో కమెడియన్ సత్య డ్యాన్స్..వీడియో
- నీరవ్ మోదీ కేసులో యూకే జడ్జి కీలక తీర్పు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి