పెట్టుబడులకు ట్రెండింగ్‌లో ఉన్న టాప్-10 వేదికలు ఇవే..

సరైన సమయంలో పెట్టుబడుల ప్రారంభం అన్నది ఎంతో తెలివైన పని. అయితే ఎందులో పెట్టుబడులు పెట్టాలన్నది కూడా తెలుసుకోవడం అంతే తెలివైన చర్య. అందుకే ప్రస్తుతం పెట్టుబడులకు ట్రెండింగ్‌లో ఉన్న టాప్-10 వేదికల గురించి ఒక్కసారి చూద్దాం.
1.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు ప్రధానంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను సూచిస్తాయి. వీటిలో లాభాలు ఫండ్ మేనేజర్ల సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దేశ, విదేశీ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది.
2.డెట్ మ్యూచువల్ ఫండ్స్
స్థిరమైన ప్రతిఫలాలను ఆశించే మదుపరులకు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలు అనుకూలం. కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, కమర్షియల్ పేపర్లు, ఇతరత్రా మార్కెట్ వ్యవస్థల్లో పెట్టుబడులు ఉంటాయి.
3.నేషనల్ పెన్షన్ స్కీం
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నది ఓ దీర్ఘకాలిక రిటైర్మెంట్ పెట్టుబడి ఆధారిత పథకం. ఇది ఈక్విటీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లు, లిక్విడ్ ఫండ్స్, ప్రభుత్వ నిధులు తదితరాల కలయిక. ఇందులో ఎంత పెట్టుబడులు పెట్టాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు.
4.బంగారం
బంగారంపై పెట్టుబడులూ ఇప్పుడు చాలా ప్రాచూర్యాన్ని పొందాయి. నగలు కాకుండా నాణేల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వివిధ బ్యాంకులూ బంగారు నాణేలను అమ్ముతున్నాయి. అలాగే గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్లూ ఉన్నాయి.
5.ఫిక్స్డ్ డిపాజిట్
ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కంటే బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్.. రిస్క్‌లేని పెట్టుబడిగా చెప్పవచ్చు. గతేడాది ఫిబ్రవరి నుంచి రూ.5 లక్షల వరకున్న డిపాజిట్లకు బీమా సౌకర్యం కూడా వచ్చింది. దీంతో సంస్థ ఏదైనా మన సొమ్ముకు మరింత భద్రత ఉన్నట్లే.
6.సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం
పదవీ విరమణ పొందినవారిలో చాలామంది ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీంలో భాగస్వాములు అవుతున్నారు. తమ పెట్టుబడుల ప్రణాళికలో దీనికే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీని గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు. కాలపరిమితి ఐదేండ్లు. మరో మూడేండ్లూ పెంచుకోవచ్చు.
7.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో పెట్టుబడులు ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును కల్పిస్తాయి. ప్రస్తుతం చాలామంది ఇందులో పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. ఇది సురక్షితమైన పెట్టుబడి. ప్రతీ మూణ్ణెళ్లకోసారి దీని వడ్డీరేట్లు మారుతాయి.
8.ప్రధాన మంత్రి వయో వందన యోజన
ఇది 60 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారి కోసం ఏర్పాటు చేసిన పథకం. ఇందులో పెట్టుబడులపై ఏటా 7.4 శాతం ప్రతిఫలం వస్తుంది. నెలసరి, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పద్ధతుల్లో కనిష్ఠంగా రూ.1,000 గరిష్ఠంగా 9,250 పెన్షన్ పొందవచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. కాలపరిమితి పదేండ్లు.
9.స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అందరికీ అనుకూలం కాదు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఈక్విటీ పెట్టుబడులు.. లాభాలను ఇస్తాయన్న గ్యారంటీ ఉండదు మరి. అయితే ఓపికతో, అవగాహనతో ట్రేడింగ్ చేస్తే నష్టాలు మాత్రం రావని చెప్పవచ్చు. నిపుణుల సలహాలతో ముందుకెళ్తే ఆకర్షణీయ ప్రతిఫలాలు దక్కుతాయి.
10.రియల్ ఎస్టేట్
సొంతింటి కల సాకారమైన తర్వాత.. నిర్మాణ రంగంలో వెచ్చించే ప్రతి పైసా పెట్టుబడి కిందకే వస్తుంది. కాబట్టి మీ భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్‌లోనూ ఆస్తుల కొనుగోలు ద్వారా మదుపు చేయవచ్చు.
తాజావార్తలు
- ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా అశ్విన్
- పుచ్చకాయలను తింటే హైబీపీ సులభంగా తగ్గుతుందట..!
- పూజాహెగ్డే షాకింగ్ రెమ్యునరేషన్..?
- మోటోరోలా నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు
- పెట్రో ధరలపై రగడ.. రాజ్యసభ రేపటికి వాయిదా
- మరికాసేపట్లో రాజీనామా చేయనున్న ఉత్తరాఖండ్ సీఎం !
- ట్రాలీ ఆటో ఢీకొని యువకుడు మృతి
- ఈ యువతి శిరోజాలు అదరహో..!
- క్రిప్టోకరెన్సీలో మదుపు : డిజిటల్ కరెన్సీలపై మెట్రో మగువల మోజు!
- కరోనా టెస్ట్.. మెడికల్ సిబ్బందిని ఆటపట్టించిన సచిన్.. వీడియో