బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 15:06:46

అమ్మో! టమాట కొనలేం.. తినలేం..

అమ్మో! టమాట కొనలేం.. తినలేం..

హైదరాబాద్ : టమాట ధర వేగంగా పెరుగుతోంది.దేశ రాజదాని డిల్లీలో టమాటల రిటైల్ ధర కిలోక రూ.70 కి చేరింది. హైదరాబాద్ లో కూడా టమాట ధరలు ఆకాశాన్నంటాయి. సోమవారం నాడు హైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాట ధర రూ.70 గా ఉన్నది. 

టమోటా సీజన్ ముగిసినందున టమాట ధర పెరుగుతున్నది. ఢిల్లీలోని రిటైల్ మార్కెట్లలో జూన్ ఒకటో తేదీ తర్వాత ప్రతి వారం టమోటా ధర కిలోకు రూ.10 పెరుగుతూ వచ్చాయి. బిగ్‌బాస్కెట్, గ్రోవర్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ పెరుగుదల కనిపించింది. ఆదివారం బిగ్‌బాస్కెట్ టొమాటోను కిలోకు రూ.60-66 కు విక్రయించింది. గ్రోవర్స్ లో కిలోకు రూ .53-55 చొప్పున విక్రయించారు. నాణ్యత ప్రకారం రిటైల్ మార్కెట్లలో టమోటాలు కిలోకు రూ.70 తీసుకొంటున్నారు. హోల్‌సేల్ మార్కెట్లలో పంటలు తక్కువగా రావడం వల్ల గత కొన్ని వారాలుగా టమాట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.

దక్షిణ భారతదేశంలోని కొన్ని టమోటా పెరుగుతున్న రాష్ట్రాల్లో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా టమాట పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రభావితమైందని వ్యాపారులు తెలిపారు. ఈ సీజన్లో టమాట సరఫరా తక్కువగా ఉన్నందున ధర పెరిగిందని గత వారం వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ చెప్పారు. 

ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో టమోటా ఉత్పత్తి తక్కువగా ఉన్నది. ఈ రాష్ట్రాలు టమాట లభ్యత కోసం ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ఆధారపడి ఉన్నాయి.

అధికారిక గణాంకాల ప్రకారం, దేశం ఏటా 1.973 మిలియన్ టన్నుల టమాటలను ఉత్పత్తి చేస్తుండగా.. వార్షిక వినియోగం సుమారు 11.51 మిలియన్ టన్నులుగా ఉన్నది.


logo