సోమవారం 01 జూన్ 2020
Business - May 14, 2020 , 15:44:34

ఒక్క ఫోన్‌ కాల్‌తో 3700 ఉద్యోగాలు ఊడాయ్‌

ఒక్క ఫోన్‌ కాల్‌తో 3700 ఉద్యోగాలు ఊడాయ్‌

న్యూఢిల్లీ: ఆఫీసులకు వెళ్లేందుకు అందరూ సిద్ధమవుతున్న వేళ.. ఊబర్‌ ఉద్యోగులకు వచ్చిన ఒకే ఒక ఫోన్‌ కాల్‌.. దాదాపు 3,700 మంది ఉద్యోగాల నుంచి తొలగించివేసింది. ఆ ఫోన్‌ వచ్చింది ఊబర్‌ కస్టమర్‌ సర్వీస్‌ హెడ్‌ రఫిన్‌ చావెలి నుంచి. కేవలం మూడే నిమిషాలు కొనసాగిన ఆ ఫోన్‌ కాల్‌.. 3,700 మంది ఉద్యోగులకు మతి స్థిమితం లేకుండా చేసింది. ఉద్యోగులను తొలగించేందుకు పాటించాల్సిన ముందస్తు చర్యలను పాటించకపోవడం పట్ల ఆ సంస్థ ఉద్యోగులు బాహాటంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఊబర్‌ సర్వీసులు మూతపడటంతో సంస్థ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నది. ఈ దశలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక వారిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పిలిచి.. ఇంతకాలంపాటు సంస్థకు మీ సేవలు అందించినందుకు కృతజ్ఞతలు. నేటి నుంచి మీరు ఉద్యోగాలకు రానక్కరలేదు. సంస్థ ఆర్థికంగా పుంజుకొన్న తర్వాత మీసేవలు అవసరం  అనుకొంటే మిమ్మల్ని పిలుస్తాం.. అంటూ కస్టమర్‌ సర్వీస్‌ హెచ్‌ రఫిన్‌ చావెలి ఉద్యోగులు చెప్పారు. దాంతో ఒక్కఫోన్‌ కాల్‌తో 3,700 మంది ఉద్యోగాలు పోయాయి. 2020 తొలి క్వార్టర్‌లో ఊబెర్‌ సంస్థ 2.9 బిలియన్‌ డాలర్ల నష్టాలను చవిచూసింది.


logo