బుధవారం 03 మార్చి 2021
Business - Dec 21, 2020 , 12:29:10

నష్టాల్లో ప్ర్రారంభమై లాభాల్లోకి... స్టాక్ మార్కెట్లు

 నష్టాల్లో ప్ర్రారంభమై లాభాల్లోకి... స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటి తర్వాత లాభాల వైపు మళ్లాయి. గతవారం సెన్సెక్స్ 46,960 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం సెన్సెక్స్ 174.31 పాయింట్లు అంటే 0.37శాతం క్షీణించి 46,786.38 పాయింట్ల వద్ద, నిఫ్టీ 56.20 పాయింట్లు అంటే 0.41శాతం పడిపోయి 13704.30 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 648 షేర్లు లాభాల్లో, 837 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 79 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 18 పైసలు పెరిగి 73.75 వద్ద ప్రారంభమైంది. క్రితం వారం 73.57 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


VIDEOS

logo