సోమవారం 08 మార్చి 2021
Business - Dec 22, 2020 , 13:57:42

మరోసారి పెరిగిన బంగారం ధరలు...

 మరోసారి పెరిగిన బంగారం ధరలు...

ముంబై:  పసిడి ధరలు మంగళవారం ప్రారంభ సెషన్‌లో ఒత్తిడికి గురయ్యాయి. బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో కొత్త రకం వైరస్ కేసులు నమోదు కావడం, పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయడంతో గత కొద్ది రోజులుగా పసిడిపై ఒత్తిడి పెరిగి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రకటన నేపథ్యంలో గత నెలలో రూ.47,500 స్థాయికి వచ్చిన పసిడి, ఇప్పటి వరకు దాదాపు రూ.3000 పెరిగింది. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

బ్రిటన్‌లో కొత్త కేసుల నేపథ్యంలో నిన్న మార్కెట్లు కుప్పకూలాయి. అయితే చివరలో అతి భారీ నష్టాల నుండి కాస్త ముందుకు వచ్చాయి. అలాగే, బంగారం ధరలు కూడా ప్రారంభంలో రూ.500 వరకు పెరిగినా, చివరకు స్వల్ప పెరుగుదలతో ముగిశాయి. బంగారం ధర ఫిబ్రవరి ఫ్యూచర్స్  రూ.44.00 అంటే 0.09శాతం పెరిగి రూ.50460.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో రూ.50,527.00 వద్ద ప్రారంభమై, రూ.50,527.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,416.00 వద్ద కనిష్టాన్నితాకింది.

ఇంటర్నేషనల్ మార్కెట్లో..

ఇంటర్నేషనల్ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం1,882.80 వద్ద క్లోజ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.95 అంటే +0.21శాతం డాలర్లు పెరిగి 1,886.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈరోజు సెషన్లో 1,880.55 - 1,889.35 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 26.28 శాతం పెరిగింది.

 ఇవి కూడా చదవండి...  

140 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్...

స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి


VIDEOS

logo