శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 27, 2020 , 23:53:25

మారుతి కార్లు ప్రియం

మారుతి  కార్లు ప్రియం
  • రూ.10 వేల వరకు పెంచిన సంస్థ

న్యూఢిల్లీ, జనవరి 27: సార్వత్రిక బడ్జెట్‌ కంటే ముందుగానే వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది మారుతి సుజుకీ. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.10 వేల వరకు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉత్పత్తి వ్యయాలు అధికమవడం వల్లనే ధరలను 4.7 శాతం వరకు సవరించాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంట్రి లెవల్‌ ఆల్టో కారు రూ.900 నుంచి రూ.6 వేల వరకు, ఎస్‌-ప్రెస్సో రూ.1,500 నుంచి రూ.8,000 వరకు, వ్యాగన్‌ ఆర్‌ రూ.1,500 నుంచి రూ.4,000 వరకు ప్రియంకానున్నాయి. వీటితోపాటు మల్టీ పర్పస్‌ వాహనమైన ఎర్టిగా రూ.4,000 నుంచి రూ.10 వేల వరకు, బాలెనో రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు, ఎక్స్‌ఎల్‌6 రూ.5 వేల వరకు అధికమవనున్నాయి. ఈ ధరలన్ని ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. ప్రస్తుతం సంస్థ రూ.2.89 లక్షలు మొదలుకొని రూ.11.47 లక్షల లోపు ధర కలిగిన పలు మోడళ్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నది. 


logo