శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 11, 2021 , 00:17:18

టైటాన్‌ లాభంలో వృద్ధి

టైటాన్‌ లాభంలో వృద్ధి

న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టైటాన్‌ కంపెనీ రూ.530 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ.474 కోట్లతో పోలిస్తే ఇది 11.81 శాతం అధికమని పేర్కొంది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికి కంపెనీ ఆదాయం 16.93 శాతం పెరిగి రూ.7,659 కోట్లకు చేరుకున్నది. దీంట్లో ఆభరణాల విక్రయాల ద్వారా రూ.6,249 కోట్ల ఆదాయం సమకూరగా, గడియారాలతో రూ.550 కోట్లు, కంటి అద్దాల బిజినెస్‌తో రూ.124 కోట్లు లభించినట్లు వెల్లడించింది. 

VIDEOS

logo