హైదరాబాద్లో సేవలు ఆరంభించిన సంస్థ
హైదరాబాద్, మే 5: ప్రముఖ అనలటిక్స్ క్లౌడ్ సేవల సంస్థ థాట్స్పాట్ తన కార్యాకలాపాలను ఇతర నగరాలకు విస్తరించింది. హైదరాబాద్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి డియోట్టాను కైవసం చేసుకున్నది. ఆర్థిక వివరాలు మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు అయిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కొనుగోలుతో సంస్థలోకి కొత్తగా 60 మంది సిబ్బంది చేరగా, మొత్తంగా 100 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ డియోట్టాను కొనుగోలు చేయడంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి వీలు పడనున్నదని కంపెనీ చీఫ్ డెవలప్మెంట్ అఫీసర్ సుమిత్ అరోరా తెలిపారు.