గురువారం 28 మే 2020
Business - May 12, 2020 , 20:24:40

ఆ కంపెనీలు చైనా నుంచి వైదొలిగినా లాభించదు

ఆ కంపెనీలు చైనా నుంచి వైదొలిగినా లాభించదు

కోల్‌కతా: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమించే అవకాశాలు ఉన్నప్పటికీ .. వీటితో భారత్‌కు లాభిస్తుందని కచ్చింగా చెప్పలేమని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అన్నారు. కొవిడ్‌-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు ఉపకరించే రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు పశ్చిమ బెంగాల్‌ ఏర్పాటుచేసిన గ్లోబల్‌ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా వ్యవహరిస్తున్న అభిజిత్‌ బెనర్జీ సోమవారం ఓ న్యూస్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్య చేశారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాయే కారణమని చాలామంది నిందిస్తున్నారు. చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమిస్తే భారత్‌ లాభపడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ అలా జరుగకపోవచ్చు. చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకొంటే ఆ దేశ ఉత్పత్తులు మరింత చౌకగా లభిస్తాయి. దీంతో ప్రజలు వాటి కొనుగోళ్లను కొనసాగిస్తారు’ అని బెనర్జీ పేర్కొన్నారు. కరోనా కాటుతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనల ప్యాకేజీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  


logo