శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 02, 2020 , 18:15:58

భారత్‌లో 4కే ప్రీమియం ఓత్‌ప్రో టీవీలను ఆవిష్కరించిన థాంప్సన్

భారత్‌లో 4కే ప్రీమియం ఓత్‌ప్రో టీవీలను ఆవిష్కరించిన థాంప్సన్

న్యూ ఢిల్లీ: యురోపియన్‌ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ థాంప్సన్ తమ ప్రీమియం టీవీల శ్రేణి ఓత్ ప్రోను భారత్‌లో ఆవిష్కరించింది. 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల పరిమాణంలో లభించే ఈ టీవీల ధరలు 24,999 రూపాయల నుంచి ఆరంభమవుతాయి. జూలై 5వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై మాత్రమే ఇవి లభ్యమవుతాయని కంపెనీ పేర్కొంది. 

ఈ టీవీలు ప్రపంచంలో అత్యుత్తమ టీవీ ఫీచర్లు అయిన ఎంఈఎంసీ (మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్), డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10, బ్లూటూత్ 5.0, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ప్లేస్టోర్‌కు షార్ట్‌కట్స్‌తో వస్తున్నాయి. పారిస్‌లో డిజైన్ చేసి, భారతదేశంలో తయారవుతున్న ఓత్ ప్రో టీవీల్లో అధికారిక ఆండ్రాయిడ్ 9.0ను తమ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌గా ఉపయోగిస్తున్నారు. హెచ్‌డీఆర్ టెక్నాలజీతోపాటు ఇంటర్నల్‌ స్పీకర్స్‌ సౌకర్యం ఉంది. కాగా, ఈ అందుబాటు ధరల్లోని ప్రీమియం ఆఫరింగ్‌తో థాంప్సన్ ఇప్పుడు వన్‌ప్లస్ టీవీలకు గట్టిపోటీని ఇవ్వనుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo