గురువారం 13 ఆగస్టు 2020
Business - Aug 01, 2020 , 16:08:33

మేక్ ఇన్ ఇండియా సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీని ఆవిష్కరించిన థాంప్సన్

మేక్ ఇన్ ఇండియా సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీని ఆవిష్కరించిన థాంప్సన్

హైదరాబాద్: ప్రీమియం బీజెల్ లెస్ స్మార్ట్ టీవీలను ఓత్ ప్రో సిరీస్‌లో భాగంగా గత నెల విజయవంతంగా ఆవిష్కరించిన అనంతరం, యూరోపిన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ థాంప్సన్ ఇప్పుడు ‘పాత్’ సిరీస్‌ను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది. ఈ సిరీస్ టీవీలు ఆగస్టు 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌పై ప్రత్యేకంగా లభించనున్నాయి.

వర్క్‌ ఫ్రమ్ హోం అవసరాలను తీర్చే రీతిలో ‘పాత్’ సిరీస్‌ను డిజైన్ చేశారు. గుగూల్ అసిస్టెంట్ మద్దతు కలిగిన పాత్ సిరీస్, ఆన్లైన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆవిష్కరణ గురించి సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌పీపీఎల్) అండ్ ఇండియా బ్రాండ్ లైసెన్సీ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ ‘రాబోయే ఐదేళ్లలో ఆండ్రాయిడ్ టీవీ తయారీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గూగుల్‌తో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. పాత్ 9ఏ, 9 ఆర్ సిరీస్‌ను పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేసి, తయారుచేశాం. వోకల్ ఫర్ లోకల్ ఆండ్రాయిడ్ టీవీలకు ఇది ఆరంభం.’ అని వెల్లడించారు. ఈ టీవీల ఆవిష్కరణతో 2021-22 సంవత్సరాంతానికి 7% మార్కెట్ వాటాను పొందగలమని ఆశిస్తున్నామని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo