సోమవారం 30 మార్చి 2020
Business - Jan 29, 2020 , 23:24:51

ఈసారి జీడీపీ 5 శాతమే: ఫిక్కీ

ఈసారి జీడీపీ 5 శాతమే: ఫిక్కీ

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసిం ది. బుధవారం విడుదల చేసిన తమ ఆర్థిక ముఖచిత్రం సర్వేలో జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) అంచనాలకు తగ్గట్లుగా వృద్ధిరేటు అంచనాల్ని వెల్లడించింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వృద్ధిరేటు 2.6 శాతంగా ఉండొచ్చన్న ఫిక్కీ.. పరిశ్రమ, సేవా రంగాల్లో 3.5 శాతం, 7.2 శాతంగా అంచనా వేసింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో దేశ వృద్ధిరేటు 4.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అంతకుముందు త్రైమాసికంలో 4.5 శాతంగానే ఉన్న విష యం తెలిసిందే. తొలి త్రైమాసికంలో 5 శాతంగా ఉన్నది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ 5.5 శాతంగా నమోదు కావచ్చని ఫిక్కీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈసారితో పోల్చితే 0.5 శాతం పెరుగడానికి వీలుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు ఎగుమతులు మరింత తగ్గవచ్చని, ఈ ఆర్థిక సంవత్సరం గతంతో పోల్చితే 2.1 శాతం మేర పడిపోవచ్చని ఫిక్కీ అంచనా వేసింది. దిగుమతులు సైతం 5.5 శాతం తగ్గవచ్చని చెప్పింది. ఇక కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) జీడీపీలో 1.4 శాతానికి పెరిగే వీలుందన్నది.


logo