ప్రతియేటా ఏప్రిల్ ఏడో తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తున్నాం.. ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి వేళ.. అందరి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ప్రాముఖ్యం ఉంది.. సుదీర్ఘ కాలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. దీనిపై అవగాహనకు ప్రచారోద్యమం చేపడుతున్నది.. ఈ ఏడాది బిల్డింగ్ ఏ ఫెయిరర్.. హెల్తీయర్ వరల్డ్.. అనే థీమ్‌తో అవగాహన కల్పనకు క్రుషి జరుగుతున్నది. మిగతా వారికంటే కొందరు మెరుగైన ఆరోగ్య సేవలను పొందుతూ ఆరోగ్యకరంగా జీవిస్తున్నారు..
ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాలు ఆరోగ్యకరంగా ఉన్నాయన్న విషయమై బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న మనీ డాట్ కో డాట్ యూకే వెబ్సైట్.. 2021లో ఆరోగ్యకర దేశాల జాబితాను ఆవిష్కరించింది. ఈ వెబ్సైట్ ప్రతియేటా ఆరోగ్యకర దేశాల జాబితాను వెల్లడిస్తున్నది..
కొన్ని ముఖ్యమైన అంశాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య దేశాలను ఖరారు చేశారు. జీవన నిరీక్షణ, ఆరోగ్యకర జీవనానికి వ్యయం, వాయు కాలుష్యం, ఊబకాయం, సేఫ్టీ, సన్‌లైట్ అవర్స్ తదితర అంశాలు ప్రమాణాలుగా తీసుకున్నారు.
స్పెయిన్ వాసులు నిరంతరం వ్యాయామం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.. దానివల్ల వారు చాలా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉంటారు. దీనివల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. అందువల్ల మిగతా దేశాల పౌరులతో పోలిస్తే తక్కువ వ్యాధుల భారీన పడుతుంటారు. శాఖాహారానికి ప్రాధాన్యం ఇస్తుంటారు స్పెయిన్ వాసులు..
ప్రపంచ ఆరోగ్య దేశాల్లో రెండో స్థానంలో ఉన్న పోర్చుగల్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ అందుబాటులో ఉంది. అందుకే యూరప్‌లో 9వ, ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది.
ప్రపంచ దేశాలతో పోలిస్తే స్విట్జర్లాండ్ వాసులు ఆరోగ్యం, విద్య, ప్రతిభ పాటవాలను పెంచుకోవడానికి ముందుంటారు.
జపాన్ వాసులు లైఫ్ అండ్ హెల్తీ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువ. మహిళల్లో చాలా ఎక్కువ. మరణాల రేటు తక్కువే.
హెల్తీ డైట్, క్లీన్ వాటర్, గుడ్ హెల్త్ కేర్ సిస్టమ్స్‌కు పెట్టింది పేరు ఐస్లాండ్. ఆరోగ్యకరమైన జీవన విధానానికి ప్రాధాన్యం ఇస్తారు..
ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇటలీలో మంచి హెల్త్‌కేర్ సిస్టమ్ ఉంది. హెల్తీ కుషన్, హెల్తీ డైట్‌కు ప్రాధాన్యం ఇస్తారు.
ప్రపంచంలోకెల్లా అత్యంత హెల్త్ కాన్సియస్ దేశంగా స్వీడన్ పేరు తెచ్చుకుంది. నోర్డిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్ తేలిగ్గా అందుబాటులో ఉంటాయి. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల సేవలు లభిస్తాయి. నార్వేలోనూ బెస్ట్ హెల్త్‌కేర్ సిస్టమ్స్ ప్రజలకు లభ్యం అవుతాయి.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్‌కార్ట్ డీల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్