e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home News China Reality Crisis | డ్రాగ‌న్ ప్ర‌గ‌తి పేక‌మేడ‌?!.. డిఫాల్ట్ దిశ‌గా రియాల్టీ..!

China Reality Crisis | డ్రాగ‌న్ ప్ర‌గ‌తి పేక‌మేడ‌?!.. డిఫాల్ట్ దిశ‌గా రియాల్టీ..!

China Reality Crisis | డ్రాగ‌న్ అభివృద్ధి అంతా డొల్లేనా.. మొన్న‌టి వ‌ర‌కు బిలియ‌నీర్లుగా ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకున్న ఆలీబాబా ఫౌండ‌ర్ జాక్‌మా వంటి వారు క‌నుమ‌రుగ‌వుతున్నారు. వారి సంప‌ద క‌రిగిపోతోంది.. తాజాగా చైనాలో రియ‌ల్టీ సంస్థ‌లూ దివాళా తీస్తున్నాయా.. అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎవ‌ర్ గ్రాండే.. భారీగా చేసిన అప్పులు.. బాండ్లు చెల్లించ‌లేక డిఫాల్ట్ దిశ‌గా అడుగులేస్తుందా.. అన్న డౌట్స్ వ్య‌క్తం అవుతున్నాయి. దీంతోపాటు మ‌రో రియాల్టీ సంస్థ‌ల భ‌విత‌వ్యం గురించి కూడా ఇన్వెస్ట‌ర్లు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ సంక్షోభం నుంచి రియాల్టీ సంస్థ‌లు ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్న‌ది అర్థం కానీ ప్ర‌శ్న‌గా నిలిచిపోయింది.

రుణాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు బ్యాంకుల‌కు అప్పీల్స్‌

ఈ కంపెనీలు త‌మ రుణాల‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించాల‌ని బ్యాంక‌ర్ల‌ను కోరుతున్నాయి. మ‌రోవైపు బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాల‌ని చైనా స‌ర్కార్‌ను వేడుకుంటున్నాయి. అయితే.. జీ జిన్‌పింగ్ ప్ర‌భుత్వం మాత్రం ఇండ్ల కొనుగోలుదారుల హ‌క్కుల‌ను కాపాడుతాన‌ని మాత్రం చెబుతోంది.

- Advertisement -

ప‌లు గ‌డువుల్లోపు చెల్లింపుల్లో డీఫాల్ట్స్ జ‌రుగుతుండ‌టంతో చైనా ఎకాన‌మీ ప‌రిస్థితి దారుణంగా మారుతుందా? అన్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఎవ‌ర్ గ్రాండేతోపాటు దేశంలోని మ‌రో మూడు రియాల్టీ సంస్థ‌లు ఫంటాసియా, మోడ్ర‌న్ లాండ్‌, సినిక్ హోల్డింగ్స్‌ సంక్షోభంలో చిక్కుకున్నాయి.

కొండంత భారీ రుణాల్లో ఎవ‌ర్‌గ్రాండే

భారీగా రుణ భారం, బాండ్ల‌పై చెల్లింపులు చేయ‌లేక‌పోయిన ఎవ‌ర్‌గ్రాండే సంక్షోభం గ‌త నెలలో బ‌య‌ట ప‌డింది. 20 బిలియ‌న్ డాల‌ర్ల ఇంట‌ర్నేష‌న‌ల్ బాండ్ల‌తోపాటు మొత్తం 300 బిలియ‌న్ల డాల‌ర్ల రుణ భారాన్ని మోస్తోంది. సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులో ఒక చైనా బ్యాంకులో త‌న వాటాను విక్ర‌యించి 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల న‌గ‌దు కూడ‌గ‌ట్టింది. ఈ వారంలోపు బాండ్ల‌పై 148 మిలియ‌న్ డాల‌ర్ల వ‌డ్డీ చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంద‌ని స‌మాచారం. ఇలా డెడ్‌లైన్లు మిస్ కావ‌డం ఇది మూడోసారి.

గ్రేస్ పీరియడ్ కూడా దాటేశారు..

డెడ్‌లైన్ మిస్ అయినా.. 30 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఉంటుంది. అది కూడా సెప్టెంబ‌ర్ 23 నుంచి మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌ర్‌గ్రాండే స్టాక్స్ 80 శాతం ప‌త‌నం అయ్యాయి. ఇప్పుడు దాని విలువ ఐదు బిలియ‌న్ల డాల‌ర్లే (హాంకాంగ్ డాల‌ర్ల‌లో 39 బిలియ‌న్లు). ఎవ‌ర్‌గ్రాండే త‌న సంస్థ‌లో వాటాల విక్ర‌యం కోసం ఇత‌ర సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. అందుకోసం స్టాక్ మార్కెట్ల‌లో త‌మ స్క్రిప్ట్ ట్రేడింగ్ నిలిపేసింది.

అద‌న‌పు టైం కోరిన మోడ్ర‌న్ లాండ్‌

ఎవ‌ర్‌గ్రాండే త‌ర్వాత స్థానంలో ఉన్న మోడ్ర‌న్ లాండ్ క‌థ కూడా ఇదే. స‌కాలంలో డ‌బ్బు చెల్లించ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంది. త‌మ‌కు అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అద‌న‌పు టైం ఇవ్వాల‌ని ఇన్వెస్ట‌ర్లు మోడ్ర‌న్ లాండ్ కోరింది. 250 మిలియ‌న్ డాల‌ర్ల బాండ్ల‌ను చెల్లించాల్సి ఉంది. సంస్థ చైర్మ‌న్ జాంగ్ లై, ప్రెసిడెంట్ జాంగ్ పెన్ త‌మ సొంత ఆస్తుల‌ను విక్ర‌యించి బిజినెస్‌కు స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. 124 మిలియ‌న్ల డాల‌ర్లు కేటాయించ‌గ‌ల‌మ‌ని చెబుతున్నారు. ఈ సంస్థ స్టాక్ ఈ ఏడాది సుమారు 50 శాతం క‌రిగిపోయింది. ప్ర‌స్తుతం దీని మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ 160 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే.

విదేశీ రుణాలు డీఫాల్ట్‌?

ఫాంటాసియా హోల్డింగ్స్‌.. ఓ ల‌గ్జ‌రీ అపార్ట్‌మెంట్ డెవ‌ల‌ప‌ర్‌. షెన్‌జెన్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఫాంటాసియా గ‌త వారం రుణ దాత‌ల‌కు 315 మిలియ‌న్ డాల‌ర్ల‌ను చెల్లించ‌డంలో ఫెయిలైంది. 206 మిలియ‌న్ డాల‌ర్ల బాండ్ల రీ పేమెంట్‌, 109 మిలియ‌న్ డాల‌ర్ల రుణాలు ఇందులో ఉన్నాయి. విదేశాల్లో తీసుకున్న రుణాలు డీఫాల్ట్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయని వార్త‌లొచ్చాయి. ఈ సంస్థ షేర్ సుమారు 60 శాతం న‌ష్ట‌పోయి 420 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది.

సినిక్ హోల్డింగ్‌కు ఫిచ్ సీ గ్రేడ్‌

మ‌రో హోం బిల్డ‌ర్ సినిక్ హోల్డింగ్స్ కూడా మిగ‌తా డెవ‌ల‌ప‌ర్ల జాబితాలో క‌లిసింది. 250 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన బాండ్ల పేమెంట్స్ డిఫాల్ట్ అవుతాయ‌ని సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఈ నెల 18 లోపు ఈ బాండ్ల చెల్లింపులు జ‌రగాల్సి ఉంది. ఇప్ప‌టికే ఈ సంస్థ‌కు ఫిచ్ సీ గ్రేడ్ రేటింగ్ ఇచ్చింది. స‌కాలంలో పేమెంట్స్ చేయ‌లేక‌పోతే బ్యాంకులు దివాలా ప్ర‌క్రియ చేప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ ఏడాదిలో దీని షేర్ సుమారు 90 శాతం న‌ష్ట‌పోయింది. ప్ర‌స్తుతం సినిక్ హోల్డింగ్స్ ఎం క్యాప్ కేలం 230 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

Disinvestment: ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!

Power Crisis | ప్ర‌పంచానికి కరెంటు క‌ష్టాలు.. ఇక పాలు కూడా పిత‌క‌లేరేమో..

అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? స‌గ‌టు వ్య‌క్తి జీవిత‌కాలం క‌ష్ట‌ప‌డినా అంత రాదు!!

రూ 15 ల‌క్ష‌ల లోపు రానున్న టాప్‌ ఎల‌క్ట్రిక్ కార్లు ఇవే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement