బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 04, 2020 , 02:14:11

నిజంగా దురదృష్టకరం

నిజంగా దురదృష్టకరం

మారటోరియం కేసులో ఆర్బీఐని

సుప్రీం కోర్టు ప్రశ్నించడంపై దీపక్‌ పరేఖ్‌

న్యూఢిల్లీ, జూలై 3: ఆర్థిక రంగ నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ను సుప్రీం కోర్టు నిలదీయడం ఆశ్చర్యంగా ఉందని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. అసలు ఈ విషయంలో కోర్టుకు ఆర్బీఐ ఎందుకు సమాధానమివ్వాలని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రుణాలపై మారటోరియం కేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ను అత్యున్నత న్యాయస్థానం వివరణ కోరుతున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇలా జరుగడం నిజంగా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రుణాలపై వడ్డీ చెల్లింపులు అనేవి రుణదాత, రుణగ్రహీతల మధ్య జరిగే ఒప్పందాల ప్రకారం ఉంటాయని గుర్తుచేశారు. వాటికీ, చట్టాల ఉల్లంఘనకూ ఏమీ సంబంధం లేదన్నారు. ‘ఈ అంశాలను సున్నితంగా పరిష్కరించుకోవాలి. బ్యాంకర్లు, ఇతర ఆర్థిక సంస్థల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ కేసులో నిర్ణయాలుంటాయని ఆశిస్తున్నాం’ అని భాగస్వాములకు రాసిన  వార్షిక లేఖలో పరేఖ్‌ తెలిపారు. అన్ని రకాల రుణాలపై ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం రుణగ్రహీతలపై మరింత భారం మోపేలా ఉందని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


logo