బుధవారం 03 మార్చి 2021
Business - Jan 19, 2021 , 00:43:10

మార్కెట్లు ఢమాల్‌

మార్కెట్లు ఢమాల్‌

ముంబై, జనవరి 18: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు అంతేవేగంతో దిగువకు పడిపోతున్నాయి. వరుసగా రెండోరోజు సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అలజడి కారణంగా దేశీయ మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.  రూపాయికి మరిన్ని చిల్లులు పడటం కూడా సూచీల పతనానికి పరోక్షంగా కారణమైంది. 470.40 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 48,564.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 152.40 పాయింట్లు పతనం చెంది 14,281.30 వద్ద స్థిరపడింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం సూచీల పతనానికి కారణమైందని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి. ఓఎన్‌జీసీ అత్యధికంగా 4.59 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. 

VIDEOS

logo