గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 09, 2020 , 00:07:35

ఉత్పత్తిని తగ్గించాలి

ఉత్పత్తిని తగ్గించాలి
  • కరోనా కాటుకు ఆర్థిక వ్యవస్థ కుదేలు
  • చమురు ఉత్పాదక దేశాలకు ఒపెక్‌ కమిటీ సిఫార్సు

అల్జీర్స్‌, ఫిబ్రవరి 8: కరోనా వైరస్‌ నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఆర్థిక కార్యకలాపాలపై ఈ ప్రాణాంతక వైరస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు చమురు ఉత్పాదక దేశాల సంఘం ఒపెక్‌, దాని మిత్ర దేశాలు ఈ కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో కమిటీ సూచనలు, సలహాలను అల్జీరియా ఇంధన శాఖ మంత్రి మహ్మద్‌ ఆర్కబ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కరోనా వైరస్‌ అంటువ్యాధి ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని, పర్యాటక, రవాణా, పారిశ్రామిక రంగాలు దెబ్బ తిన్నాయని, చైనా పరిస్థితి దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపోయే వీలుందని, ధరల పతనాన్ని అడ్డుకునేలా ఉత్పత్తిని తగ్గించుకోవాలని కమిటీ సూచించినట్లు ఆర్కబ్‌ చెప్పారు. త్వరలో వియన్నాలో జరిగే సమావేశంలో ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి తగ్గింపుపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే వీలుందన్నారు.


logo
>>>>>>