గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 16, 2021 , 03:03:36

సరికొత్త హంగులతో స్కోడా సూపర్బ్‌

సరికొత్త హంగులతో స్కోడా సూపర్బ్‌

  • పారంభ ధర రూ.31.99 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 15: చెక్‌ రిపబ్లిక్‌ ఆటోమొబైల్‌ కంపెనీ స్కోడా తన ప్రీమియం సెడాన్‌ ‘సూపర్బ్‌'ను సరికొత్త హంగులతో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సెవెన్‌-స్పీడ్‌ ఆటోమ్యాటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉండే ఈ వాహనాన్ని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. వీటిలో ‘స్పోర్ట్‌లైన్‌' ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ.31.99 లక్షలుగా, ‘లారిన్‌ అండ్‌ క్లెమెంట్‌' ధరను రూ.34.99 లక్షలుగా నిర్ణయించినట్లు స్కోడా ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోలిస్‌ వెల్లడించారు. 

VIDEOS

logo