ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 16, 2021 , 03:07:36

కైగర్‌ కనీస ధర రూ.5.45 లక్షలు

కైగర్‌ కనీస ధర రూ.5.45 లక్షలు

ముంబై, ఫిబ్రవరి 15: ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ కంపెనీ రెనో.. ఇటీవల విపణిలోకి తీసుకొచ్చిన ‘కైగర్‌' కారు ధరను సోమవారం ప్రకటించింది. రూ.5.45 లక్షల నుంచి రూ.9.55 లక్షలకు ఈ ఎస్‌యూవీ లభ్యమవుతుందని వెల్లడించింది. అంతేకాకుండా దీని బుకింగ్‌లను సోమవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లతోపాటు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా కైగర్‌ను బుక్‌చేసుకోవచ్చని తెలిపింది. తొలుత భారత్‌లో ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో రెనో ప్రవేశపెట్టిన మోడళ్లలో క్విడ్‌, ట్రైబర్‌ తర్వాత కైగర్‌ మూడవది. 

VIDEOS

logo